MOTO G62 Phone : ప్రముఖ మొబైల్ టెక్ సంస్థ అయినటువంటి మోటో తాజాగా భారత మార్కెట్లోకి సరికొత్త సిరీస్ ను ప్రవేశ పెట్టబోతోంది. ఇకపోతే MOTO G62 పేరుతో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను గురువారం ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. స్మార్ట్ ఫోన్ అప్డేటెడ్ వెర్షన్ ఫీచర్లతో యూజర్లకు అందుబాటులోకి వచ్చింది . ఇకపోతే ఈ స్మార్ట్ మొబైల్ యొక్క పూర్తి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరలు ఇలా అన్ని విషయాలను ఇప్పుడు ఒకసారి మనం చదివి తెలుసుకుందాం. ఇండియన్ మార్కెట్లో విడుదల అయిన MOTO G62 రెండు వేరియంట్లతో లభించనుంది.
అందులో ఒకటి 6GB ర్యామ్ +128 GB స్టోరేజ్ వేరియంట్ తో మార్కెట్లో దీని ధర రూ.17,999. ఇక మరొక వేరియంట్ 8GB +128 GB స్టోరేజ్ వేరియంట్ తో మార్కెట్లో రూ.19,999 వద్ద నిర్ణయించడం జరిగింది. ఇకపోతే కలర్స్ విషయానికి వస్తే ఫ్రస్టేడ్ బ్లూ, మిడ్నైట్ గ్రే కలర్లలో అందుబాటులోకి ఉండనుంది. ఆగస్టు 19వ తేదీ నుంచి యూజర్లకు భారత్ లో కొనుగోలుకు అందుబాటులోకి వస్తాయి. అయితే ఈ కామర్స్ దిగ్గజమైన ఫ్లిప్కార్ట్ వేదికగా ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రానుంది.ఇక హెచ్డిఎఫ్సి బ్యాంకు కార్డు వినియోగదారులు 10% తక్షణ తగ్గింపుతో రూ.16,750 అలాగే రూ.18,249 కే కొనుగోలు చేయవచ్చు. ఇతర స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే 6.5 అంగుళాల 1080X2400 పిక్సెల్స్ రెజల్యూషన్ తో ఫుల్ హెచ్డి ఎల్సిడి డిస్ప్లే ప్యానెల్ ను అందిస్తున్నట్లు సమాచారం.
120 Hz రీఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. ఈ హ్యాండ్ సెట్ స్నాప్ డ్రాగన్ 695 Soc ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది .ఇక ఆండ్రాయిడ్ 12 ఆధారంగా పనిచేస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే ట్రిపుల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. 50 ఎంపీ మెగాపిక్సల్ క్వాలిటీతో లభిస్తుంది . అంతే కాదు క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీ మరియు పిడిఎఎఫ్ ని కూడా పొందుతుంది. ఇక సెల్ఫీ కోసం 16 మెగాపిక్సల్ క్వాలిటీ గల లెన్స్ ఫ్రెంట్ క్యాం కి ఇస్తున్నారు.20 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5000mah బ్యాటరీ కూడా ఉంటుంది. కనెక్టివిటీ పరంగా డ్యూయల్ బ్యాండ్ వైఫై , ఫోర్ జి ఎల్ టి ఈ, బ్లూటూత్ వి 5.1, యూఎస్బీ టైప్ సి ఫీచర్లను కలిగి ఉంటుంది.