Mother In Law : సాధారణంగా ప్రేమికురాలు ప్రేమించిన యువకుడితో లేచిపోవడం మనందరం చూస్తూనే ఉంటాం.. కానీ ఈ కేసులో మాత్రం అత్తగారు అల్లుడితో లేచిపోయి అందరికి షాక్ ఇచ్చింది. ఈ ఘటన రాజస్థాన్ లోని సిరోహి జిల్లాలో జరిగింది. విదేశాల్లో ఉంటున్న తన అల్లుడు తన భార్యను తీసుకుని అత్తారింటికి వచ్చాడు. అతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారు విదేశాల్లోనే ఉన్నారు. అల్లుడితో లేచిపోవాలనుకున్న అత్త పక్కా ప్లాన్ అంతా వంటగదిలో నుంచే అమలు చేసింది..

తన ఇంటికి వచ్చిన అల్లుడికి ప్రత్యేకంగా చికెన్ కూర వండి పెట్టింది అత్త. ఇక తన కూతురికి తన భర్తకి మాత్రం ప్రత్యేకంగా మటన్ కూర వండి అందులో నిద్ర మాత్రలు కలిపి వారికి వడ్డించింది . ఇక వారు నిద్రపోయాక అల్లుడితో కలిసి విదేశాలకు చెక్కేసింది. వారిద్దరి మధ్య 13 సంవత్సరాల గ్యాప్ ఉంది. సాయంత్రం నాలుగు గంటలకు నిద్రలేచిన మామకి దిమ్మ తిరిగింది. తన భార్య అల్లుడు కనిపించట్లేదని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. రమేష్ తన కూతురు కిస్నా ను నారాయణ జోగికి ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే తన భార్యను అల్లుడు ప్రేమిస్తున్నాడని ఎన్నాళ్ళ నుంచి అసలు నాకు అనుమానమే రాలేదని ఆయన చెప్పుకొచ్చాడు. ఇక నారాయణ్ తన భార్యను ఇండియాకు రప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అలాంటి వాడితో నేను కాపురం చేయనని తన కూతురు తాగేసి చెప్పిందట. ఈ విషయం తెలిసిన అందరూ అవ్వ అని ముక్కున వేలేసుకుంటున్నారు.