మోడీ పిలుపుతో ఢిల్లీలో ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్..!!

ఇటీవల 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ ఎర్రకోటలో జెండాని ఎగరవేశారు. ఈ సందర్భంగా దేశ అభివృద్ధి ఇంకా రాబోయే రోజులలో ప్రపంచంలో భారతదేశం అధిరోహించే విషయాల గురించి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుందని మోడీ జోష్యం చెప్పారు. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా తనకంటూ సెపరేట్ ఇమేజ్ ఇటీవల ఏర్పరచుకోవటం తెలిసిందే. “RRR”తో ఎన్టీఆర్ సత్తా చాటడం జరిగింది.

central-government-passes-to-new-guidelines-for-movie-stars
central-government-passes-to-new-guidelines-for-movie-stars

అంతర్జాతీయ ప్రతిష్టాత్మక సినీ అవార్డు ఆస్కార్ రేసులో కూడా ఎన్టీఆర్ నిలవడం జరిగింది. ఇదిలా ఉంటే ఆగస్టు 15వ తారీకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా ప్రధాని మోడీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సమావేశమైనట్లు సరికొత్త వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా భారతీయ నటుడిగా ఎన్టీఆర్ కీర్తి సంపాదించడంతో ప్రధాని మోడీ అభినందించడం జరిగింది అంట.

అంతేకాదు త్వరలో ఓ ప్రతిష్టాత్మకమైన అవార్డు కూడా తారక్ కి ఇవ్వటానికి మోడీ రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏకంగా ప్రధాని మోడీతో ఎన్టీఆర్ కలిసి నట్లు వస్తున్న వార్త పట్ల నందమూరి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. “RRR”తో ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించడం జరిగింది. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ ప్రపంచ మార్కెట్ నీ దృష్టిలో పెట్టుకుని పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో “దేవర” అనే సినిమా చేస్తున్నారు.