Modi – Chandrababu Naidu :రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదని చాలామంది చెబుతుంటారు. మా నాయకుడే గుండెకాయని.. చెప్పేవాళ్లే వెన్నుపోటు పొడిచిన ఘటనలు ఇటీవాళ తెలుగు రాజకీయాల్లో కనిపించాయి. ఎవరైతే శత్రువు అని అనుకుంటారో..రేపు వారితోనే మిత్రపక్షం ఏర్పరచుకునే పరిస్థితులు కూడా దాపరిస్తయి. రాజకీయాల్లో ఏది కూడా శాశ్వతం కాదు. సరిగ్గా ఇప్పుడు ఇదే బీజేపీ …టీడీపీ పార్టీల మధ్య జరుగుతుంది. విషయంలోకి వెళ్తే మొదటి నుండి భారతీయ జనతా పార్టీతో టీడీపీ కలిసి పనిచేయడం జరిగింది. 2014లో కూడా టీడీపీ..బీజేపీ పార్టీలు పొత్తులు పెట్టుకుని అధికారంలోకి వచ్చాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీల విషయంలో మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో ఆ సమయంలో బీజేపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు విభేదించారు.

ఆ తర్వాత 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఒంటరిగా పోటీ చేశారు. అప్పటినుండి బీజేపీతో ఏర్పడిన గ్యాప్ మొన్నటి వరకు రెండు పార్టీల మధ్య కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే దక్షిణాదిలో కర్ణాటక తర్వాత బీజేపీ కొద్దో గొప్పో బలపడుతున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పవచ్చు. ఈ ఏడాదిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో మోడీ … BRS పార్టీని ఓడించాలంటే చంద్రబాబుతో చెలిమి చేయాల్సిందే అని డిసైడ్ అయ్యారు అని అంటున్నారు. ఎందుకంటే తెలంగాణలో తెలుగుదేశంకి తిరుగులేని క్యాడర్ ఉంది. దీంతో కేసీఆర్ ని ఢీ కొట్టాలంటే.. తెలంగాణలో బిజెపికి టిడిపి సాయం అందితే.. కచ్చితంగా అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని మోడీ యొక్క అంచనా.
దీంతో చంద్రబాబుతో మళ్ళీ పాత స్నేహం కొనసాగించడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఒక తెలంగాణలో మాత్రమే కాకుండా ఆంధ్రలో కూడా పొత్తు.. ఉండే విధంగా ఇటు చంద్రబాబు కూడా సరైన వ్యూహాలతో సిద్ధంగా ఉన్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏప్రిల్ 8వ తారీకు మోడీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో టీడీపీతో బీజేపీ ఒత్తుకు సంబంధించి ఒక క్లారిటీ రానున్నట్లు సమాచారం.