Mlc elections reverse votes lady video : దొంగ ఓటేసిన మహిళ.. మరోసారి అడ్డంగా దొరికిపోయింది..

Mlc elections reverse votes lady video : వైసిపికి దొంగ ఓటేసిన మహిళ.. మరోసారి అడ్డంగా దొరికిపోయింది..

Advertisement

ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు వాడేవేడిగా జరిగాయి. ఇక ఈరోజు తుది ఫలితాలు కూడా వచ్చాయి. కాగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు మద్యం అంటూ రకరకాల స్కీములతో వైసిపి ఓటరు దేవుళ్ళను ఆకట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి అడ్డంగా దొరికిపోయింది.. ఇక అందులో భాగంగా ఓ మహిళ దొంగ ఓటు వేస్తున్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. మహిళ ఇప్పుడు టిడిపి నేతలతో ప్లేటు ఫిరాయించి మాట్లాడుతున్న వీడియో మరోసారి నెట్టింట చక్కర్లు కొడుతోంది..

Advertisement

మా మహిళ కనిపించడంతో కొంతమంది ఆమెను నువ్వు దొంగ ఓటు వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది అని అంటుండగా నాకేం తెలుసు అది మామూలు ఎన్నికలు అనుకొని వెళ్ళాను. ఇంటి పక్కన చుట్టుపక్కల వాళ్ళు ఎలక్షన్లో అని అంటుంటే వెళ్లి ఓటేశాను అని అంటుంది. నేను మామూలు ఎలక్షన్లు అనుకొని వెళ్లి ఓటేసేను.. లేదంటే ఎందుకు వెళ్తాను.

ఇంత రాద్ధాంతం ఎందుకు అయ్యేది కాదని ఆమె అంది. మా ఇంట్లో వాళ్ళు కూడా అరిచారు అంటూ చెప్పుకొచ్చింది. ఇంతకీ ఎవరికి ఓటు వేసావు అని అడగగా.. మొదటి గుర్తుకు వేశానని మళ్ళీ ప్లేట్ ఫిరాయించి.. రెండో వాళ్లకి వేశానని తనను నోటికి వచ్చినట్టుగా సమాధానం చెప్పింది.. నువ్వు తమిళనాడు సైడ్ నుంచి వచ్చావని అడగక అవును అని చెబుతుంది.

నువ్వు దొంగ ఓటు వేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది అంటూ ఆ పక్కన ఉన్న మా కొంతమంది మాట్లాడుతున్న మాటలు కూడా ఆ వీడియోలో వినిపిస్తాయి. ప్రస్తుతం ఈ మహిళ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్ గా మారాయి.

https://www.youtube.com/watch?v=JXr3_XiEXxM

Advertisement