Mlc elections results on ycp has not favour : ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై నేతల మధ్య బాడీ వేడిగా చర్చ జరుగుతోంది.. ఉత్తరాంధ్ర మంత్రులు ఎమ్మెల్యేలు అత్యవసర భేటీ అయ్యారు. వైసీపీ ఏ స్థాయిలో ఉందని అంచనా వేయలేకపోతున్నామని అంటున్నారు. తమ ఆస్త్రాలు ప్రభుత్వ వ్యతిరేకత ముందు విఫలమవుతున్నామని వారు అంటున్నారు. రాజకీయాన్ని వాలంటీర్ల వ్యవస్థ పై వదిలేయడం వల్లే ఇదంతా జరిగిందని నిట్టూరుస్తున్నారు..
ఆఖరికి కడప జిల్లాలో కూడా వైసీపీకి అనుకూల ఓటింగ్ జరగలేదని నేతలు చెబుతున్నారు. మరోవైపు సీఎం ఈ ఎలక్షన్లపై ఎలా స్పందిస్తారో అని మంత్రులు ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారట వారి పదవులకు ఏదైనా ముప్పు ఉండొచ్చని ముందు నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. వైసీపీ నేతలు తర్షణ పరిచిన పడుతున్నారు. ఈ ఫలితాలతో వారికి డేంజర్ బేల్స్ మోగుతున్నాయని వైసీపీలు ముందుగానే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై చర్చించుకుంటున్నారు.
9 జిల్లాలు 108 నియోజకవర్గాల్లో వచ్చిన ఫలితాలు ప్రజల నాడి స్పష్టమైందని చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై ఉత్తరాంధ్ర నేతలు వాడివిడిగా చర్చించుకుంటున్నారు. నగరాలు , పట్టణాలు, సెమీ అర్బన్ ఏరియాలలో ఉండే ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ రాయలసీమతో పాటు మరికొన్ని ఏరియాలలో తెలుగుదేశమే ఆధిక్యం సాధించడంతో వైసిపి నేతలు ఆలోచనలో పడ్డారు. వారి ప్రభుత్వం విఫలమైందనే సంశయం ఎక్కువగా వినిపిస్తోంది.
ఉత్తరాంధ్ర నాయకులు చర్చించుకున్న చర్చల్లో.. ఎందుకు ఇంతలో వ్యతిరేకత వచ్చింది అనే అంశం గురించి మాట్లాడుకున్న మాటల్లో ఓ వైసీపీ సీనియర్ నేత ఎంత వ్యతిరేకత ప్రజల్లో ఉంటుందని ఊహించలేకపోయామని ఓపెన్ కామెంట్స్ చేశారని.. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.