Kethi Reddy : ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎక్కడుంటే ఆయన కూడా అక్కడే ఉంటారు.. నిత్యం ప్రజలలో మమేకమై వారి సాధక బాధలు తెలుసుకొని తీరుస్తూ ఉంటారుm. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో కేతిరెడ్డి ప్రతిరోజు నియోజకవర్గ ప్రజలతోనే ఆయన ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. తాజాగా ఆయన వద్దకు డ్వాక్రా సంఘాల మహిళలు మోసపోయామంటూ వారి గోడు చెప్పుకున్నారు కేతిరెడ్డికి.. వెంటనే ఆ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి బ్యాంకుకే వెళ్లి వారి సమస్యలు దగ్గరుండి పరిష్కరించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

పట్టణంలోని సుదర్శన్ కాంప్లెక్స్ లో గల యూనియన్ బ్యాంకులో బ్యాంకు కరెస్పాండెంట్ గా పనిచేస్తున్న శివారెడ్డి పై కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని రీజినల్ మేనేజర్ కు సమాచారం అందించి, బ్యాంకు మేనేజర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కొన్ని రోజుల కిందట రూరల్ పరిధిలోని రేగాటిపల్లిలోని 26 డ్వాక్రా గ్రూపులకు సంబంధించిన దాదాపు ఒక కోటి రూపాయలకు పైగా స్వాహా కావడం ఇక్కడ మరో హైలైట్. ఈ విషయంపై శుక్రవారం నేరుగా ఎమ్మెల్యే బ్యాంకుకు చేరుకొని మేనేజర్ తో జరిగిన విషయాలను అడిగి తెలుసుకున్నారు.
బ్యాంకు మేనేజర్ తో పాటు ఈ డబ్బు మాయం విషయంపై పలు అంశాలపై వారు చర్చించారు. ఇంత పెద్ద మొత్తము రెండు సంవత్సరాలుగా మీ బ్యాంకులో ఎందుకు జమ కాలేకపోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఆడిట్ కూడా ఆస్కారం లేని విధంగా ఎలా జరిగిందని వారు ప్రశ్నించారు. తరువాత రీజినల్ మేనేజర్ కు ఈ మోసపూరిత విషయాన్ని తెలిపి డ్వాక్రా మహిళలకు న్యాయం చేయాలని వారు మేనేజర్ కు సూచించారు కేతిరెడ్డి.
ఆ తరువాత డ్వాక్రా మహిళల తో నగరం లోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదును ఇప్పించారు. డ్వాక్రా మహిళలకు న్యాయం జరిగేంత వరకు తాను పోరాడతానని ఎమ్మెల్యే అన్నారు . వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ విషయంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందన్న విషయాన్ని తెలుసుకుని శిక్ష పడేలా చేస్తానన్నారు. ఎమ్మెల్యే స్పందనకు డ్వాక్రా గ్రూప్ మహిళలందరూ కూడా కృతజ్ఞతలను తెలిపారు.