Case Solved by Parrot : 2014 షాకింగ్ న్యూస్ ఆగ్రా న్యూస్ పేపర్ చీఫ్ ఎడిటర్ విజయ్ శర్మ తన కొడుకు రాజేష్,కూతురు నివేదిత కలిసి ఫిరోజాబాద్ లోని పెళ్లికి వెళ్లారు. తన భార్య అనారోగ్య పరిస్థితి వల్ల వెలలేకపోయింది. కూతురు కొడుకు తన తండ్రి కలిసి వెళ్లి మరలా రాత్రి తిరిగి 11 గంటలకు ఇంటికి చేరుకున్నారు. వెళ్ళగానే గేటు ఓపెన్ చేసి ఉంది. అది చూసి అందరూ భయపడ్డారు. తర్వాత లోపలికి వెళ్లి చూడగానే.. బెడ్ రూమ్లో నీలంశర్మ రక్తపు మడుగుల్లో పడి ఉంది. ఇంటి కాపలాగా ఉన్న కుక్కను కూడా హాల్లో చంపి పడేశారు. వెంటనే తన కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన జర్నలిస్టు కావడం వలన పోలీసులు ప్రతిరోజు వచ్చి విజయ్ శర్మతో చర్చించి వెళ్లేవారు. నెల రోజులు అయినప్పటికీ కూడా ఎటు తేల్చలేకపోయారు పోలీసులు. ఎటువంటి క్లూ కూడా చెప్పలేదు.

ఇక ఇంట్లోనే రామచిలక కన్నీళ్లు పెట్టుకుంది. ఎంత గింజలు వేసినా కూడా తినకుండా ఉంది. దీన్ని డాక్టర్ కూడా చూపించారు. చేతుకున్న ఉంగరం నుంచి వంటిపై ఉన్న మొత్తం నగలని దోచుకున్నారు. చిలుకంటే నీలం కు ఎంతో ప్రేమ. జరిగిన విషయం తలుచుకుంటూ విజయ్ శర్మ ఆఫీసుకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయాడు. అయితే ప్రతిరోజు ఎవరో ఒకరు బంధువులు వచ్చి వెళ్ళిపోతూ ఉండేవారు. అదేవిధంగా ఒకరోజు మేనకోడలు అశు ఇంట్లోకి వచ్చిన ప్రతిసారి అప్పటిదాకా మౌనంగా ఉన్న రామచిలుక ఒక్కసారిగా గట్టిగా అరిచేది. అసలు ఎప్పుడు పిలిచినా పలకని చిలుక ఆమెను చూసి వణికి పోయేది. ఆ విధంగా మొదటి 3సార్లు చిలుకకు ఏమైంది అని అనుకునేవారు. ఇతరులు ఎవరు వచ్చినా అరిచేది కాదు. ఎప్పుడూ చూడని మనుషులు వచ్చినా కూడా అరిచేది కాదు కానీ ఆమెను చూసి అరిచేది. దీంతో విజయ శర్మ కి అనుమానం వచ్చింది.
విజయ్ శర్మ చిలుక ఎందుకు ఆ విధంగా చేస్తుంది. అని పోలీసుల దగ్గరకు వెళ్లి జరిగింది అంతా చెప్పాడు. ఆ తర్వాత పోలీసులు తన మేడ కోడలు మీద నిగా బట్టారు. ఆ విధంగా ఆమె కాల్ డేటాను పరిశీలించగా ఆమెకు లవర్ కూడా ఉన్నాడు. వారు శారీరకంగా కలుసుకునేవారు. అయితే ఒకరోజు పోలీసులు విచారిస్తూ ఉండగా వాళ్లు ఇద్దరూ ఒక బంగారు షాపు నుంచి బయటకు వస్తుండగా కనబడ్డారు. షాపు ఆయన్ని అడగ్గా ఆయన నా దగ్గర బంగారు అమ్మారు కానీ ఈ విషయాన్ని రహస్యంగా ఉంచమని చెప్పారని పోలీసులకు చెప్పాడు. తీరా ఆ బంగారాన్ని పరిశీలించగా ఆ బంగారు ఆభరణాలు అన్నీ కూడా నీలం వే అని విజయ్ శర్మ గుర్తించారు.ఆ విధంగా పోలీసులు రోనీని,అశ్విని తమదైన శైలిలో విచారించగా నగల కోసం మేమే హత్య చేశామని కుక్కని కూడా మేమే చంపమని చెప్పారు. మొత్తం ఫ్రీ ప్లాన్ గా చేశాము అని చెప్పేసింది.