Video call : ఒక కుటుంబంలోని వ్యక్తి కనిపించకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము.. వాళ్ళు అన్ని విధాలుగా ఆ కేస్ గురించి ఆలోచించి ఎవరైనా గుర్తు తెలియని మనిషి శవం కనిపిస్తే అంతకుముందు కంప్లైంట్ ఇచ్చిన వారిని పిలిపించి ఆ శవం వారి బంధువులదేమో గుర్తించమని అడుగుతారు.. అలా గుర్తించిన తరువాత ఆ మనిషి వారి బంధువులైతే వారికి అప్పగిస్తారు.. ఇక వాళ్లు నిర్ధారించిన తరువాతే పోస్టుమార్టం చేస్తారు. కానీ అదే వెతికి వ్యక్తి మళ్ళీ తిరిగి వచ్చి వీడియో కాల్ చేశాడు ఈ సంఘటనలో.. పూర్తి విషయాలు ఇలా ఉన్నాయి.

కుటుంబ సభ్యులు అతడు చనిపోయాడని అనుకున్నారు ఖననం కూడా చేశారు.. కొద్దిరోజులకు సోషల్ మీడియా ద్వారా లైవ్ వీడియోలో కనిపించాడు. ఏముంది పోలీసుల వేట ప్రారంభమైంది.. మహారాష్ట్రలోని పాల్ ఘర్ కి చెందిన 60 ఏళ్ల వృద్ధుడు రఫిక్ షేక్ ఆటో రిక్షా నడిపేవాడు.. ఆయన గత రెండు నెలల క్రితం కనిపించకుండా పోయాడు.. అదే సమయంలో బోయెసర్ పాలగడ్ స్టేషన్ల మధ్య ఓ వ్యక్తి హత్య జరిగింది.
పోలీసులకు అనుమానం వచ్చి కేరళలో ఉంటున్న షేక్ భార్యకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పరిశీలించిన ఆమె చనిపోయింది తన భర్తని పొరపాటుగా నిర్ధారించింది. దీంతో ఆయనకు ఖననం చేసేశారు. కొద్దిరోజులు అనంతరం షేక్ సోషల్ మీడియా ద్వారా తన స్నేహితుడికి వీడియో కాల్ చేశాడు. కంగు తిన్న స్నేహితుడు షాక్ తో ఆదివారం పోలీసులను ఆశ్రయించాడు. చనిపోయిన వ్యక్తి రఫిక్ షేక్ కాదని నిర్ధారించుకున్నారు.