షావోమీ.. ఈ మధ్యకాలంలో తమ బ్రాండ్ యొక్క ఉనికిని చాటుకోవడానికి రకరకాల స్మార్ట్ ఫోన్ లను అద్భుతమైన ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేస్తోంది. ఇప్పుడు తక్కువ ధరలో మొబైల్ కొనాలనుకునే వారికి కూడా మరొక బెస్ట్ ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చిందని చెప్పవచ్చు. కొత్తగా రెడ్మి బ్రాండ్ నుంచి ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. ఇక రెడ్మి A1స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన నేపథ్యంలో హెచ్డి ప్లస్ డిస్ప్లే తో ఈ మొబైల్ వస్తుండగా ఫ్రంట్ కెమెరా కోసం వాటర్ డ్రాప్ స్టైల్ నాచ ను కూడా ఏర్పాటు చేశారు. ఇక క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ ను ఈ స్మార్ట్ ఫోన్ మీకు కలిగిస్తుంది.
ఇకపోతే ధర , వేరియంట్స్ విషయానికి వస్తే రెడ్మీ A1 స్మార్ట్ ఫోన్ మీకు ఒకే వేరియంట్ లో లభిస్తూ ఉంది.. 2GB ర్యామ్ + 32 GB స్టోరేజ్ వేరియంట్ లో లభించే ఈ స్మార్ట్ఫోన్ ధర కేవలం రూ.6,499 మాత్రమే. ఇక ఈనెల తొమ్మిదవ తేదీన సాయంత్రం 4గంటలకు ఫ్లాష్ సేల్ కు వస్తుంది. ఇక కలర్స్ విషయానికి వస్తే లైట్ గ్రీన్, లైట్ బ్లూ, క్లాసిక్ బ్లాక్ వంటి కలర్ ఆప్షన్స్ లో మీరు ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఇతర ఫీచర్ విషయానికి వస్తే 6.5 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లే తో ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తుంది. ఇక ఆక్టా కోర్ మీడియా టెక్ హీలియో A22 ప్రాసెసర్ తో పనిచేస్తుంది ఇక ఆండ్రాయిడ్ 12 క్లీన్ యు ఐ ఆపరేటింగ్ సిస్టంతో ఈ మొబైల్ లభిస్తుంది అంతేకాదు మైక్రో ఎస్డి కార్డు కోసం ప్రత్యేకమైన స్లాట్ ను కూడా ఈ ఫోన్లో అమర్చారు.
ఇక కెమెరా విషయానికి వస్తే ఎయిట్ మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు మరో సెన్సార్ తో ఈ ఫోన్ వస్తుంది ఇక సెల్ఫీ కోసం ఫైవ్ మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాను అమర్చారు ఇక జిపిఎస్ బ్లూటూత్ వైఫై 3.5 mm హెడ్ ఫోన్ తో పాటు జాక్ కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి.10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5000 ఎం ఏ హెచ్ బ్యాటరీ ని కూడా కలిగి ఉంటుంది త్వరగా కొనుగోలు చేస్తే మీరు మరింత డబ్బును ఆదా చేసుకోవచ్చు.