Walteru Veerayya: వాల్తేరు వీరయ్య లో నాలుగు బిగ్ మైనస్ లు ఇవే — అందుకే సినిమా సరిగ్గా ఆడట్లేదు !

Walteru Veerayya:మెగాస్టార్ చిరంజీవి శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య.. ఈ సినిమా సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అందుకుంది.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు వసూలు చేస్తుంది. అయినా కానీ ఈ సినిమాపై ఇంకా నెగిటివ్ ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో ఈ నాలుగు సన్నివేశాలు అస్సలు బాగోలేదు. అందుకే వాల్తేరు వీరయ్య సినిమా ధియేటర్లో ఆడకపోవడానికి ఇదే కారణం అంటూ.. ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ నాలుగు రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

Megastar Walteru veeraya  these 4 points in bad talk
Megastar Walteru veeraya these 4 points in bad talk

సినిమా అంటే ముందుగా గుర్తొచ్చేది హీరో హీరోయిన్స్. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి శ్రుతిహాసన్ లవ్ సీన్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. కానీ చిరంజీవి పాత్ర విడిగా శృతిహాసన్ రోల్ విడిగా బాగానే డిజైన్ చేశారు. కాకపోతే ఇద్దరి మధ్య వచ్చేసి మాత్రం కాస్త డిఫరెంట్ గా అనిపించాయి. వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన కొన్ని సీన్స్ మాత్రం హీరో హీరోయిన్ల అనిపించలేదని కామెంట్స్ కూడా వినిపించాయి . వీళ్ళ కాంబినేషన్ సీన్స్ డిజైన్ చేస్తున్నప్పుడు ఇంకాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండు అని అంటున్నారు.

ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు అసలు లాజిక్ తో సంబంధం లేకుండా ఉన్నాయి. నేవీ అధికారులను ఒక సాధారణ మనిషి వచ్చి కాపాడడం విచిత్రంగా ఉంది అని అంటున్నారు .ఎందుకంటే నావి చుట్టూ టైట్ సెక్యూరిటీ ఉంటుంది. అంత పెద్ద అధికారులని సాధారణ వచ్చి వ్యక్తి కాపాడడం ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సినిమాలో కొన్ని పాత్రలు తీర్చిదిద్దిన విధానంపై కామెంట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ క్యారెక్టర్జని గురించి. అసలు సినిమా మొదటిసారి చూస్తున్న వాళ్లకి కూడా ప్రకాష్ రాజ్ నెక్స్ట్ సీన్ ఏంటో ప్రేక్షకులు చెప్పేటట్టుగా ఉంది. ఈ సినిమాలో పాటలు అద్భుతంగా ఉన్నాయి. కొన్ని స్టెప్పులు మాత్రం బాగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాలో ఒక రెండు పాటలు మాత్రం బలవంతంగా తీసుకువచ్చి యాడ్ చేసినట్లుగా అనిపిస్తుంది.

సెకండ్ ఆఫ్ లో ఎమోషనల్ గా సాగుతున్నప్పుడు ఓ పాట వస్తుంది. అసలు అలాంటి సమయంలో పాట అవసరమా అంటూ కామెంట్స్ వినిపించాయి. ఏది ఏమైనా ఎన్ని నెగిటివ్ కామెంట్స్ ఉన్నా కూడా అక్కడ ఉన్నది మెగాస్టార్ చిరంజీవి.. చాలా రోజుల తర్వాత మెగాస్టార్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా మాత్రం థియేటర్లో ఇంకా నడుస్తోంది. సినిమా అన్నాక తప్పొప్పులు ఎంచడం ఖాయం. అందులో భాగంగా ఈ తప్పులు ఎంచుతున్నారు ట్రోలర్స్.