Walteru : వాల్తేరు వీరయ్య ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.! అందులో.. అప్పుడు.!

Walteru: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ చిత్రం వాల్తేరు వీరయ్య సినిమా నేడు గ్రాండ్ గా ధియేటర్స్ లో విడుదలైంది.. చిరంజీవి సరసన శృతిహాసన్ నటించగా.. రవితేజ సరసన కేథరిన్ థెరిసా నటించారు. ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమాలో బాబీ సింహ, ప్రదీప్ రావత్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు.. బాస్ మూవీ కావడంతో ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అంతా సెర్చ్ చేస్తున్నారు.. తాజాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ సొంతం చేసుకున్నట్లు.. రిలీజ్ డేట్ కూడా అప్పుడే అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Advertisement
Megastar Walteru veeraya OTT release date
Megastar Walteru veeraya OTT release date

ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకున్నట్లుగా సమాచారం. కాగా ఈ సినిమా ఓటీటీలోకి నిర్మాతలు చేసుకున్న ఒప్పందం ప్రకారం.. సినిమా విడుదలైన దాదాపు 8 వారాల తరువాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేసుకునే హక్కు నెట్ ఫ్లిక్స్ సంస్థకు ఇచ్చారు. అంటే ఒకవేళ బాస్ సినిమాని ఇంటిల్లిపాది కూర్చుని ఇంట్లో చూడాలంటే మరో ఎనిమిది వారాల పాటు ఆగక తప్పదు. అంటే మార్చి నెల చివరలో ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ నిర్మాణంలో ఈ సినిమాని డైరెక్టర్ బాబీ తెరకెక్కించారు. ఈ సినిమా మొదటి షో నుంచి హిట్ టాక్ తో దూసుకెళ్తోంది.

Advertisement
Advertisement