Walteru: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ చిత్రం వాల్తేరు వీరయ్య నేడు థియేటర్స్ లో సందడి చేస్తోంది.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ సినిమాను నిర్మించారు. మెగాస్టార్ అంటే మాస్ ఇమేజ్.. ఈయనకు తోడుగా ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ కూడా ఇందులో యాడ్ అయ్యారు. దీంతో మెగా మాస్ పక్కా అంటూ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ప్రీమియర్ షోస్ నుంచే హిట్ టాక్ తో దూసుకెళ్తోంది.. మెగాభిమానులు పండగ చేసుకునే ఆ మాస్ డైలాగ్స్ పై ఓ లుక్కేయండి..
* మాస్ అనే పదానికి బొడ్డు కోసి పేరెట్టింది ఆయన్ను చూసి
* మీ కథలోకి నేను రాలే.. నా కథలోకే మీరందరు వచ్చారు
* వీడు నా ఎరా.. నువ్వే నా సొరా
* వైజాగ్ లో గట్టి వేటగాడు లేడని, ఒక పులి పూనకాలతో వుగుతుందటా..
* రికార్డుల్లో నా పేరు ఉండటం కాదు, నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి
* హలో మాష్టారు.. ఫేస్ కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి. ఒక్కొక్కడికి బాక్సులు బద్దలైపోతాయి
* ఏంట్రా బద్దలయ్యేది.. ఈ సిటీకి నీలాంటి కమీషనర్లు ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు కానీ వీరయ్య లోకల్..