ఎన్టీఆర్ ని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేసిన మెగాస్టార్ చిరంజీవి..!!

“RRR”తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అయిపోవడం తెలిసిందే. ఏకంగా ప్రపంచ ప్రతిష్టాత్మక సినీ అవార్డు ఆస్కార్ రేసులో చోటు సంపాదించుకొని ఎన్టీఆర్ తను నటనతో సత్తా చాటారు. ఇక ఇదే సినిమాలో తన తోటి హీరో చరణ్ తో తారక్ కి మంచి బాండింగ్ క్రియేట్ అయ్యింది. “RRR” సినిమా ప్రీమియర్ చూసిన తర్వాత మెగా కుటుంబ సభ్యులు సైతం ఇద్దరు అన్నదమ్ములు మాదిరిగా ఉన్నారని కామెంట్లు చేశారు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్గా ఓ ప్రముఖ దర్శకుడికి చిరంజీవి ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగిందంట.

Saidharam Tej movie voice over to junior NTR
Saidharam Tej movie voice over to junior NTR

ఈ క్రమంలో ఎన్టీఆర్ ప్రస్తావన రాగానే చిరంజీవి పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేసారట. చరణ్ మాదిరిగానే తారక్ నీ చూస్తే బిడ్డ మాదిరి ఫీలింగ్ కలుగుతుంది. ఇక తారక్ నటన ఒక శిఖరం అని చెప్పవచ్చు. ఎలాంటి పాత్రలోనైనా అటే లీనమై పరకాయ ప్రవేశం చేసి వెండితెరపై.. నట విశ్వరూపం చూపిస్తాడు. తారక్ పాత్రలు వెండితెరపై చూస్తే ఎక్కడ కూడా నటించినట్లు ఉండవు. పాత్ర మాత్రమే వెండితెరపై ప్రేక్షకుడికి కనిపిస్తుంది. ఇక డాన్స్ గురించి చెప్పక్కర్లేదు. తారక్ డాన్స్ నేను ఎంత ఎంజాయ్ చేస్తాను అంటూ చిరంజీవి ఇటీవల ఇంటర్వ్యూలో తారక్ నీ పొగుడుతూ చెప్పుకొచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే “భోళా శంకర్” ఆశించిన రీతిలో విజయం సాధించకపోవడంతో చిరంజీవి కొద్దిగా గ్యాప్ తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరిలో కొత్త సినిమా ప్రారంభించాలని అప్పటివరకు రెస్ట్ తీసుకోవాలని అనుకుంటున్నారట.