Meena: చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మీనా.. ఆ తరువాత హీరోయిన్ గా తెలుగు, తమిళం, మలయాళం తదితర భాషలలో స్టార్ హీరోల సరసన నటించింది. మీనా విద్యాసాగర్ అనే బెంగళూరుకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. కరోనా కారణంగా అనారోగ్యానికి గురైన విద్యాసాగర్ కన్నుమూశారు. దీంతో నటి మీనా ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా కాలమే పట్టింది. మీనా కి ధైర్యం చెప్పడానికి రంభ, కుష్బూ, సంఘవి తదితరులు వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ బాధలో నుంచి చేరుకోవడానికి మీనా ఇటీవల ఓ విదేశీ పర్యటన కూడా చేసి వచ్చారు. ఇక కుటుంబ భారన్ని మోయటానికి మళ్లీ సినిమాలలో నటించడానికి సిద్ధమయ్యారు.

గతంలో మీనా సైన్ చేసిన సినిమాలను ఇప్పుడు కంప్లీట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. తెలుగు, తమిళం , మలయాళం భాషల్లో ఒక్కో సినిమా చేయాల్సి ఉంది. దాంతోపాటు మలయాళం లో మోహన్ లాల్ సరసన దృశ్యం 3 సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే మీనా ఒక ప్రచార చిత్రంలో నటిస్తున్నారు. దానికి సంబంధించిన లేటెస్ట్ వీడియోలు తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భర్త చనిపోయిన కొన్ని నెలలకే మీనా కం బ్యాక్ అయ్యి కొత్త జీవితాన్ని మొదలు పెట్టినందుకు ఆమె అభిమానులు సంతోషిస్తున్నారు.