MarQ Smart TV : MarQ నుంచీ అదిరిపోయే ఫీచర్స్ స్మార్ట్ టీవీ.. పైగా తక్కువ ధరకే..!

MarQ Smart TV : ఇటీవల కాలంలో చాలామంది ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నట్టుగానే ప్రతి ఒక్కరి ఇంట్లో స్మార్ట్ టీవీ అనేది తప్పనిసరిగా అయిపోయింది . ఎందుకంటే థియేటర్లలో విడుదలైన ప్రతి సినిమా అలాగే వెబ్ సిరీస్ కూడా విడుదలైన నెలలోపే టీవీలలో ఓటీటీ వేదికపై ప్రసారమవుతున్న నేపథ్యంలోకి .. థియేటర్ కి వెళ్లి చూడలేని వారు ఇంట్లోనే కుటుంబంతో కలిసి తమకు నచ్చిన సినిమాలను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఓటీటీ యాప్స్ కు సపోర్టు చేసే స్మార్ట్ టీవీలు ఉండాలి అని ఆలోచిస్తున్నారు . ఇక ఈ నేపథ్యంలోనే ప్రముఖ కంపెనీలు కూడా కస్టమర్లకు అనుకూలంగా ఉండే కొన్ని రకాల టీవీలను అందుబాటులోకి తీసుకొస్తోంది.

ఈ క్రమంలోని ప్రముఖ టెక్ కంపెనీ MarQ ఒక అద్భుతమైన స్మార్ట్ టీవీ ని తీసుకురావడం జరిగింది. ఈ స్మార్ట్ టీవీ ఫీచర్స్ అలాగే స్పెసిఫికేషన్స్ కూడా చదివి తెలుసుకుందాం.. MarQ ప్రవేశపెట్టిన ఫ్లిప్కార్ట్ 32 ఇంచెస్ హెచ్డి రెడీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ.. మార్కెట్లో ఈ స్మార్ట్ టీవీ ధర రూ.34,999 కాగా దానిని మీరు కేవలం రూ.18,999కే సొంతం చేసుకోవచ్చు. ఇక ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ ఈ ఆఫర్ ను అందిస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా రూ .1,750 తగ్గింపుతో రూ.17,249కే కొనుగోలు చేయవచ్చు.

MarQ's standout features are Smart TV
MarQ’s standout features are Smart TV

అంతేకాదు ఈ ప్రాజెక్టుపై మీకు ఒక సంవత్సరం వారెంటీ కూడా లభిస్తుంది. 60 Hz రీఫ్రెష్ రేట్ తో , 20W సౌండ్ అవుట్ పుట్ ను కూడా అందిస్తుంది. 3840 x 2160 పిక్సెల్ రెజల్యూషన్ తో అల్ట్రా హెచ్డి 4కె డిస్ప్లే ను కలిగి ఉంటుంది. గూగుల్ అసిస్టెంట్, క్రోమ్ కాస్ట్ ఇన్బిల్ట్ వంటి ఆప్షన్స్ కూడా ఇందులో ఉన్నాయి. సపోర్టెడ్ యాప్ ల విషయానికి వస్తే నెట్ ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, యూట్యూబ్ వంటి ప్రముఖ ఓటిటి యాప్ లకు మద్దతు ఇస్తుంది. ఇక ఈ ఓ టీ టీ యాప్ లు మీకు అద్భుతమైన వినోదాన్ని పంచుతాయి. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యు ఎస్ బి , హెచ్ డి ఎం ఐ ఫోర్స్ కూడా కనెక్ట్ చేయబడ్డాయి.