Smart TV : MarQ నుంచి థియేటర్ అనుభూతిని కలిగిస్తున్న స్మార్ట్ టీవీ.. ధర కూడా తక్కువే..!!

Smart TV : Mar Q.. ఈమధ్య కాలంలో ఈ బ్రాండ్ బాగా పాపులారిటీ అయిందని చెప్పవచ్చు.. ఇక ఎవరైనా సరే ఒక స్మార్ట్ టీవీ ని కొనాలని ఆలోచిస్తుంటే ఆ స్మార్ట్ టీవీ మీ ఇంటిని అందంగా మార్చడమే కాకుండా సరికొత్త థియేటర్ అనుభూతిని కూడా కలిగించే విధంగా ఉండాలి . అప్పుడే మీ స్మార్ట్ టీవీ కొనుగోలుకు ఒక విలువ ఉంటుంది. ఇక మనం తీసుకునే ఏ వస్తువైనా సరే అత్యాధునికతతో కూడినది అయి ఉన్నప్పుడే కొంచెం స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందని చెప్పవచ్చు. ఇక ఈ మధ్యకాలంలో స్మార్ట్ టీవీలు అన్నీ కూడా థియేటర్ అనుభూతిని కలిగించడంతోపాటు సరికొత్త ఫీచర్లతో కస్టమర్ల కోసం అందుబాటులోకి వస్తూ ఉండడం గమనార్హం.

ఇకపోతే ఈ స్మార్ట్ టీవీలను ఫ్లిప్కార్ట్ , అమెజాన్ లాంటి ఈ కామర్స్ దిగ్గజాలు కూడా భారీ ఆఫర్లతో కస్టమర్లకు అందిస్తున్నాయి. ఇప్పుడు ఈ క్రమంలోనే ఒక మంచి వినోదాన్ని అందించే స్మార్ట్ టీవీ మీకోసం రావడం జరిగింది. మరి ఈ స్మార్ట్ టీవీ యొక్క ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, ధర అన్ని ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. MarQ 43 ఇంచెస్ అల్ట్రా హెచ్డి 4కె ఎల్ఈడి స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ.. 3840 x 2160 అల్ట్రా హెచ్డి ఫిక్సెల్ రిజర్వేషన్ తో ఈ స్మార్ట్ టీవీ డిస్ప్లే వస్తుంది. అంతేకాదు 60 Hz రిఫ్రెష్ రేటును కూడా కలిగి ఉంటుంది. ఇక సౌండ్ విషయానికి వస్తే 20 W సౌండ్ అవుట్ పుట్ ను అందిస్తుంది.

MarQ is a smart TV that gives you a theater experience
MarQ is a smart TV that gives you a theater experience

ఇక ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ తో పని చేసే ఈ స్మార్ట్ టీవీలో గూగుల్ అసిస్టెంట్ క్రోమ్ కాస్ట్ ఇన్బిల్ట్ కూడా లభిస్తాయి. ఇక సపోర్టెడ్ యాప్స్ విషయానికి వస్తే నెట్ ఫ్లెక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, యూట్యూబ్ వంటి ఓటీటీ యాప్ లకు మద్దతు పలుకుతుంది. అంతేకాదు మరికొన్ని వేల యాప్లను కూడా ఈ స్మార్ట్ టీవీలో యాక్సిస్ చేసుకోవచ్చు. ఇక ఇందులోనే సిపియు మీడియా టెక్ 64 బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది.. కనెక్టివిటీ విషయానికి వస్తే బ్లూటూత్ 5.0, వైఫై, యు ఎస్ బి, హెచ్ డి ఎం ఐ పోర్ట్ లు కూడా ఉంటాయి. ఇక ధర విషయానికి వస్తే ఫ్లిప్కార్ట్ ద్వారా మీరు ఈ టీవీని కేవలం రూ.19,999 కే సొంతం చేసుకోవచ్చు.