Manchu Manoj : మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇది వీరిద్దరికీ రెండో పెళ్లి.. ఇటీవల మనోజ్ మౌనిక కొడుకు ధైరవ్ బాధ్యతలను కూడా తీసుకుంటున్నట్టు ఇన్ డైరెక్ట్ గా ఫోటో షేర్ చేస్తూ శివుని ఆజ్ఞ అంటూ ట్వీట్ చేశారు . ఇక మనోజ్ మౌనిక పెళ్లి జరిగిన తరువాత మొదటిసారి మనోజ్ ధైరవ్ తో కలిసి ఉన్న వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఈ వీడియోలో ఉన్న మనోజ్ మౌనిక రెడ్డి కొడుకు ధైరవ్ విజువల్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి..
మోహన్ బాబు స్కూల్ యానివర్సరీ లో పాల్గొన్నారు మంచు మనోజ్ ఆయన భార్య భూమా మౌనిక రెడ్డి. మనోజ్ కంటే ముందే మౌనిక తన కొడుకు ధైరవ్ తో ముందుగా ఆ ప్లేస్ కి వెళ్ళిపోయారు. అక్కడే మోహన్ బాబు కూడా కూర్చుని ఉన్నారు కాదా ఇక మంచు మనోజ్ వస్తున్నారని మైక్ లో అనౌన్స్ చేయగానే.. ధైరవ్ వెంటనే మంచు మనోజ్ రాక కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక మనోజ్ రాగానే పరిగెత్తుకుంటూ వెళ్లి గట్టిగా మనోజ్ ను హత్తుకున్నాడు. తన కాళ్ళ మీద కాలు పెట్టి నడుచుకుంటూ వచ్చిన సీన్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి.
ఆ విజువల్స్ ని చూస్తుంటే మనోజ్ కి ధైర్యం కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక మనోజ్ ధైరవ్ ను కూడా దగ్గరకు తీసుకొని హత్తుకొని వెళ్లి కూర్చొని చెప్పాడు. ఇక సభా ప్రాంగణంలో ప్రసంగిస్తున్న అతనికి అభివాదం చేసి మనోజ్ కూడా తన సీట్ లో కూర్చున్నాడు.
ప్రస్తుతం మనోజ్ ధైరవ్ కి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రెండో పెళ్లి చేసుకున్న కూడా తన భార్య మొదటి కొడుకుని మనోజ్ యాక్సెప్ట్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అంతేకాకుండా అతనితో ఎంతో ప్రేమగా ఉండటం మరో ఎత్తు. ఈ కోణంలో మనోజ్ మరోసారి మంచి మార్కులు కొట్టేశాడు. అందరి దగ్గర మనోజ్ ఎక్కువగా విమర్శలలోకి దూరడు. తన సేవా కార్యక్రమాలతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాడు. అందుకే సినీ ఇండస్ట్రీలో మంచు మనోజ్ కి ప్రత్యేక స్థానం ఉంది.