Manchu Lakshmi: మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి అందరికీ సుపరిచితురాలే. నటిగా ఇంకా దర్శకు ర్యాలీగా నిర్మాతగా… యాంకర్ గా మల్టీ టాలెంట్ తో.. సినిమా రంగంలో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఎంటర్టైన్మెంట్ పరంగా ఎంత నిక్కచ్చిగా ఉంటుందో అదే రీతిలో… సమాజం పట్ల కూడా తనదైన బాధ్యతయుతమైన సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది.
ఈ రకంగానే “మేము సైతం” అనే టెలివిజన్ కార్యక్రమం ద్వారా సెలబ్రిటీల చేత చాలామంది పేద వాళ్లకు ఉపాధి కల్పిస్తూ కొంతమంది పేదవాళ్ల పిల్లలను కూడా చదివించడం జరిగింది. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో పలు మండలాలను ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్న మంచు లక్ష్మి అనేక మౌలిక సదుపాయాలు కల్పిస్తూ వారందరికీ ఎన్నో పనులు చేస్తూ ఉంది. ఇటువంటి నేపథ్యం కలిగిన మంచు లక్ష్మికి రీసెంట్ గా ఏకంగా ప్రధానమంత్రి ఆఫీసు నుంచి పిలుపు రావడం జరిగిందట.
విషయంలోకి వెళ్తే గురువారం మంచు లక్ష్మితో ప్రధాని మోదీ కలవబోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బిజెపిలోకి ఆమెను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారట. అంత మాత్రమే కాదు మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర మామోదించిన నేపథ్యంలో సమాజానికి ఎన్నో మంచి పనులు చేసిన మహిళను పిలిపించి ప్రధాని మోదీ సత్కరించనున్నట్లు.. దీనిలో భాగంగా మంచు లక్ష్మికి కూడా గౌరవం దక్కినట్లు సమాచారం.