Manchu Lakshmi: హీరోయిన్ మంచు లక్ష్మి అందరికీ సుపరిచితురాలే. మంచు మోహన్ బాబు కూతురుగా సినిమా రంగంలో ఎంట్రీ ఇచ్చి ఆల్రౌండర్ గా తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. హీరోయిన్ గా మాత్రమే కాకుండా దర్శకురాలిగా నిర్మాతగా కూడా రాణించింది. ఇదే సమయంలో టెలివిజన్ రంగంలో మేము సైతం అనే కార్యక్రమంతో చాలామంది పేదవాళ్లకు అనేక రకాల సహాయాలు అందేలా.. మంచి మనసు చాటుకుంది.
ఈ కార్యక్రమం ద్వారా పేద పిల్లల చదువు బాధ్యతతో పాటు కొంతమందికి ఉపాధి అవకాశాలు కూడా మంచు లక్ష్మి కల్పించింది. ఇదంతా పక్కన పెడితే మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అదిరిపోయే ఫొటోస్ తో పాటు వర్కౌట్స్ ఇంకా యోగ వంటి వీడియోలు ద్వారా ట్రెండింగ్ అవుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఇటీవల దుబాయిలో సైమా అవార్డుల వేడుక జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి దక్షిణ భారతదేశనికి చెందిన తారలంతా హాజరయ్యారు.
మంచు లక్ష్మి కూడా సైమా అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో వేదిక బయట మంచు లక్ష్మీ మీడియాతో మాట్లాడుతుండగా ఓ వ్యక్తి కెమెరాకు అడ్డుగా వెళ్లడం జరిగింది. దాంతో ఆమెకు కోపం రావడంతో వెంటనే ఆ వ్యక్తి మీకు మీద కెమెరా ముందే చెయ్యి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్లీ మాట్లాడే ప్రయత్నం చేయగా మరో వ్యక్తి అలాగే అడ్డు వెళ్ళాడు. ఒక్కసారిగా ఈ పరిణామం మంచు లక్ష్మి కోపం నషాలానికి అంటీంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది.