Mahindra Scorpio SUV : ఇటీవల కాలంలో సామాన్యులు కూడా కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే కుటుంబంలో సభ్యులు అందరూ కలిసి ఎక్కడికైనా వెళ్లాలంటే ఆటోలు, బస్సులు, రైళ్ల ప్రయాణాలు ఇలా ప్రతి ఒక్కరికీ చాలా ఇబ్బందికరంగా మారుతున్నాయి. అందుకే ప్రతి ఒక్కరు కూడా సొంత వాహనం ఉండాలి అని ఆలోచిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే సొంతంగా కారు కొనుక్కోవాలి అని.. అది సెకండ్ హ్యాండ్ లో అయినా పర్వాలేదు అని ఆలోచించే సామాన్య కుటుంబాలు కూడా లేకపోలేదు. అందరికీ అందుబాటులో ఉండే అద్భుతమైన కారు కొనాలి అని ఎవరికి మాత్రం ఉండదు.. ఇక లగ్జరీ కారు కొనుగోలు చేయాలి అంటే సామాన్య ప్రజలకు అందనంత ఆకాశం లో ధరలు ఉంటున్నాయి. పైగా జిఎస్టి , రోడ్ టాక్స్ అంటూ ఏవో రకరకాల టాక్స్ లు వేస్తూ కారు ధరలు మరింత ఎక్కువ ధరకు అమ్ముతున్నారు డీలర్స్. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ నుంచి సామాన్య ప్రజల వరకు ప్రతి ఒక్కరు అభిమానించే వెహికల్ ఏమిటి అంటే మహీంద్రా స్కార్పియో అని చెప్పవచ్చు.
ఈ వెహికల్ కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని చెప్పవచ్చు. అయితే ఈ కారు ఇంతమంది అభిమానించడానికి గల కారణాలు ఏమిటి..? అంతలా ఆకట్టుకునే అంశాలు ఈ కారులో ఏమున్నాయి అనే విషయాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఇకపోతే అత్యధిక ధనవంతు లతోపాటు టాప్ సెలబ్రిటీలు కూడా ఈ వెహికల్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కారును అంతగా అభిమానించడానికి గల కారణాలు కూడా ఇప్పుడు ఒక సారి చదివి తెలుసుకున్నాం. ఇక ఈ వెహికల్ విషయానికి వస్తే బిగ్ బాక్సీ డిజైన్ తో పాటు హెవీ స్పోర్ట్స్ యుటిలిటి వీలర్ వెహికల్స్ కు భారత మార్కెట్లో చాలా క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఇంతటి క్రేజ్ తో మహీంద్రా స్కార్పియో ఎస్ యూ వీ అభిమానులకు ఉత్తమమైన ఎంపికగా నిలుస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే దేశీయ కంపెనీకి చెందిన ఎస్ యు వి నీ అభిమానించని వారంటూ ఎవరూ ఉండరు. ఇటీవల ప్రతి ఒక్కరికి ఫేవరెట్ కారుగా ఈ కార్ మారి పోవడం గమనార్హం.
ఇక రోడ్డుపై ఈ వెహికల్ వెళ్తోంది అంటే చాలు ప్రతి ఒక్కరు కూడా దీని పైనే ఉంటుంది.. ఇక లక్షలమంది సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీలు కూడా ప్రతి ఒక్కరు మెచ్చే కారు మహీంద్రా స్కార్పియో కావడం గమనార్హం. ముఖ్యంగా మహేంద్ర స్కార్పియో కేవలం బాక్స్ డిజైనింగ్ చాలామందికి తొలి ఎంపికలో నిలుస్తూ ఉండటం గమనార్హం. ఇక ప్రతి ఒక్కరు కూడా ఈ కారును అభిమానించడం కి గల కారణం కూడా ఈ డిజైన్ అని చెప్పవచ్చు. ఇక డిజైన్ మాత్రమే కాదు సరసమైన ధరలో అందుబాటులో ఉండటం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ వెహికల్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. సామాన్య ప్రజలకు ధర తక్కువగా ఉంటే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. అందుకే ప్లస్ పాయింట్ గా ధర అనేది నిలుస్తోంది. వెహికల్ యొక్క ధర ఎంత ఉంది..
సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే లాగా ధరలను ఎలా నిర్ణయించారు అనే విషయాన్ని ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. ప్రస్తుతం ఈ ఎస్ యు వి మహేంద్ర స్కార్పియో ధర ఎక్స్ షోరూం లో రూ.13.54 లక్షల వరకు ధర పలుకుతోంది. అయితే ఈ వెహికల్ ను మొదటిసారి మార్కెట్లోకి లాంచ్ చేసినప్పుడు కేవలం రూ.10 లక్షలు మాత్రమే ఉండేది. కానీ సరికొత్త అవతారంలో మార్కెట్లో ప్రవేశ పెట్టాలని ఆలోచిస్తున్న మహేంద్ర రూ.13.54 లక్షలు నిర్ణయించింది. ఇక పొడవు 4456 మిల్లీమీటర్లు, వెడల్పు 1820 మిల్లీ మీటర్లు గా ఉంది. ఎత్తు 1995 మిల్లీమీటర్లు. ఇక ఒక లీటర్ కు 16 కిలోమీటర్ల వరకు ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉండడం గమనార్హం . ముఖ్యంగా ఆకట్టుకునే ఫీచర్లతో వస్తున్న ఈ కారును కొనుగోలు చేయడానికి ప్రతి ఒక్కరు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు తన బుల్లెట్ప్రూఫ్ వెర్షన్ వెహికల్స్ లో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం