Mahindra Scorpio Classic : ఒకప్పుడు రాయలసీమ ప్రాంతాలలో ఎక్కువగా కనిపించే వాహనాలలో స్కార్పియో కూడా ఒకటి. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎక్కువగా వీటిని ఉపయోగించేవారు. అంతేకాకుండా ఈ వాహనాలు వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉండేవి. అందుకే మార్కెట్లో తిరుగులేని అమ్మకాలను పొందుతూ నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది మహీంద్రా స్కార్పియో. అయితే రోజులు మారుతున్న కొద్దీ వాహన వినియోగదారులు కూడా ఇందులో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఇక ఈ కారణంగానే కంపెనీ ఇటీవల అప్డేటెడ్ వెర్షన్ స్కార్పియో క్లాసిక్ ను తీసుకురావడం జరిగింది..ఇక ఈ సూపర్ డ్రైవ్ పార్క్ యొక్క పూర్తి వివరాలు ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
మహేంద్ర కంపెనీ తాజాగా పాపులర్ కార్ అయినటువంటి స్కార్పియో క్లాసిక్ పేరుతో భారతీయ మార్కెట్లోకి అధికారికంగా ఆవిష్కరించింది. అయితే ఆవిష్కరణ సమయంలో ఆగస్టు 20వ తేదీన ఈ SUV విడుదలవుతుందని కంపెనీ వెల్లడించింది. ఇక మార్కెట్లో బేస్ మరియు రెండు వేరియంట్స్ లో అందుబాటులో రానున్నట్లు సమాచారం. ఇక మహీంద్రా స్కార్పియో యొక్క మునుపటి మోడల్ మొత్తం ఇప్పుడు ఫైవ్ వేరియంట్ లో అందుబాటులో ఉంది. ఇక కొత్త మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ఇప్పుడు ఐదు కలర్స్ లో అందుబాటులో ఉండడం గమనార్హం. ఇక ఆ కలర్స్ విషయానికి వస్తే.. పెర్ల్ వైట్, రెడ్ రోజ్, నాపోలి బ్లాక్, డి సాట్ సిల్వర్, అలాగే గెలాక్సీ గ్రే కలర్స్.. ఇవన్నీ కూడా చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఆకట్టుకునే విధంగా ఉండడం గమనార్హం.
ముఖ్యంగా ఈ కొత్త స్కార్పియో క్లాసిక్ చూడడానికి చాలా అందంగా కనిపించడమే కాకుండా ముందు భాగంలో కొత్త లోగో కూడా ఉంది. ఇక అదే సమయంలో ఫ్రంట్ డిజైన్ కూడా చాలా వరకు అప్డేట్ చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే దీనిని మొదటిసారి చూడగానే దాని మునుపటి మోడల్ ను గుర్తుకు తెస్తుంది. కానీ ఇందులో ఉండే రిఫ్రెస్డ్ ఫ్రంట్ గ్రిల్ దీనిని స్పష్టంగా కొత్తది అని చూపించడంలో మీకు సహాయపడుతుంది. అంతేకాకుండా సిల్వర్ స్కిడ్ ప్లేట్ తో పాటు ఫాగ్ లాంప్ హౌసింగ్ కోసం కొత్త డిజైన్ తో చేయబడిన ఫ్రంట్ బంపర్ కూడా మనం చూడవచ్చు. అంతేకాదు డైమండ్ కట్ ఫినిషింగ్ సైడ్ ప్రొఫైల్లో ఫైవ్ స్పోక్ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కూడా పొందుతారు. ఇక మొత్తం మీద ఈ డిజైన్ చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు.