Mahesh-Namratha : “అందుకే నువ్ మా బంగారు వదినవి” నమ్రత చేసిన పనికి మహేశ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ.!

Mahesh-Namratha :  సూపర్ స్టార్ మహేష్ బాబు అతని సతీమణి నమ్రత శిరోద్కర్ ఇద్దరూ సేవా కలిసి సేవా కార్యక్రమలలో ముందుంటారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేటలో చేనేత వనితలు కలిసి వస్త్ర వ్యాపారాన్ని కలిసికట్టుగా చేస్తున్నారు. చేనేత మహిళా సంఘాలు “అరుణ్య నారాయణపేట”ఆన్లైన్ విధానం ద్వారా చేనేత మహిళలు వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు.

వీరిని ప్రోత్సహించేందుకు నమ్రత మహేష్ జంటగా ఆ మహిళలను అభినందించారు.. వీరి వ్యాపారంలో ప్రత్యేకత ఏమిటంటే.. మహిళలు సొంతంగా వారి చేతులతో నేసిన చేనేత వస్త్రాలనే ఆన్లైన్ విధానం ద్వారా సేల్ చేస్తున్నారు.. చేనేత వృత్తికి మరింత ప్రాధాన్యత దొరకాలని చేనేత వనితలు పాటుపడుతున్నారు. స్వయం సహాయ కార్యక్రమాల ద్వారా తమ కాళ్ళ మీద తాము నిలబడుతూ మహిళలు చేనేత వృత్తిని ఎంతో కష్టపడి నేస్తున్న చీరలను ప్రజలందరూ ఆదరించాలంటూ “చేనేత వనితల” భుజం తట్టి మహేష్ బాబు ప్రశంసించటంతో చేనేత మహిళలు ఎంతో సంతోషించారు..

Mahesh- Namratha : Mahesh's fans are full of happiness for Namrata's work
Mahesh- Namratha : Mahesh’s fans are full of happiness for Namrata’s work

అరుణ్య నారాయణపేట సంస్థ ప్రతినిధులు నమ్రతా శిరోద్కర్ జంటను కలిశారు. తమను కలిసిన చేనేత మహిళలను అభినందించిన మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ జంట.. వారిని భుజం తట్టి ప్రోత్సహించడమే కాకుండా వారి కృషిని అభినందించారు.. స్వయం సహాయక సంఘాల ద్వారా తమ కాళ్లపై తాము నిలబడుతూనే.. అదే సమయంలో చేనేత వృత్తిని మరో స్థాయికి తీసుకెళ్లడం గొప్ప విషయని మహేష్ బాబు జంట వారికి కితాబిచ్చారు.. ప్రస్తుతం మహేష్ బాబు జంట వారి తో కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

కొంతమంది చేనేత వనితలు మహేష్ బాబు నమ్రత లను కలిశారు.. వారిని మహేష్, నమ్రత రిసీవ్ చేసుకున్న విధానం చాలా బాగుందని.. వారు మాతో మాట్లాడిన మాటలు మా మనసులో ఎంతో మనోధైర్యంతో పాటు బూస్టింగ్ ను ఇచ్చేలా చేసిందని చేనేత వనితలు తెలియజేశారు. ప్రస్తుతం చేనేత వనితలతో మహేష్ దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . హీరోయిన్ సమంత చేనేత వస్త్రాలకు తెలంగాణలో బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.