Goutam: టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు భార్య.. ప్రముఖ హీరోయిన్ నమ్రత శిరోద్కర్ షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. తాజాగా ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్న విషయం తెలిసిందే. ఒకరు గౌతమ్.. మరొకరు సితార. ఇద్దరు కూడా చదువులతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు. మొదటినుంచి పిల్లలు స్వేచ్ఛగా ఉండాలి అని భావించిన మహేష్ – నమ్రత.. గౌతమ్ , సితార విషయంలో కూడా అలాగే బిహేవ్ చేస్తూ వస్తున్నారు.

వారు ఎక్కడికి వెళ్లినా సరే తమతో పాటు తమ పిల్లల్ని కూడా తీసుకెళ్లి ప్రపంచాన్ని చూపించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే సితార కూడా ఎంత మెచ్యూర్ గా కనిపిస్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు.. ఇప్పుడు రీసెంట్గా గౌతం కూడా తన కాలేజీ స్టూడెంట్స్ తో కలిసి కల్చరల్ వరల్డ్ టూర్ కి వెళ్తున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలను నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కొడుకు గురించి ఎమోషనల్ అయింది.
“మొదటిసారి మా కొడుకు మేము లేకుండా టూర్ కి వెళ్తున్నాడు. ఈ టూర్ తనకు ఎన్నో నేర్పించాలని కోరుకుంటున్నాను.. కానీ ఒక తల్లిగా తను ఎక్కడ ఇబ్బంది పడకూడదని.. నా భయం నాకుంది.. నాలో సగభాగం దూరమవుతున్న భావన కలుగుతుంది.. దీనిని జీర్ణించుకోవడానికి సమయం పడుతుంది… గౌతమ్ మళ్లీ తిరిగి నా కళ్ళ ముందుకు వచ్చేవరకు తీరదు. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను ” అంటూ నమ్రతా తెలిపింది.
అయితే నమ్రత షేర్ చేసిన ఫోటోలు చూస్తే మాత్రం.. మహేష్ బాబు కొడుకు గౌతం ఘట్టమనేని కూడా తక్కువాడేమీ కాదు .. అంటూ ఫోటో ని రీ పోస్ట్ చేస్తూ గౌతమ్ పక్కన ఉన్న అమ్మాయిని హైలెట్ చేస్తున్నారు. మొత్తానికి అయితే నమ్రత తో షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.