Mahesh Sitara: సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురిగా సితార చిన్న వయసులోనే వార్తల్లో నిలుస్తూ ఉంది. ప్రారంభంలో సోషల్ మీడియాలో రకరకాల డాన్స్ వీడియోలు ఇంకా ఇతర దేశాలకు వెళ్ళిన సమయంలో అక్కడ వీడియోలు చిత్రీకరించి అభిమానులతో తన ఆనందం పంచుకునేది. అయితే ఇప్పుడు పట్టుమని 15 సంవత్సరాలు లేకపోయినా గాని ఇండస్ట్రీలో హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ దక్కించుకుంది. అంతేకాకుండా ఇటీవల పలు బ్రాండ్స్ కి అంబాసిడర్ గా కూడా రాణిస్తూ ఉంది. ఇదే సమయంలో షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ వేడుకలకు కూడా సితార వెళుతూ ఉంది.
తండ్రి మహేష్ బాబు తగ్గా కూతురిగా అతి చిన్న వయసులోనే సితార అందరు అభిమానులను సంపాదించుకుంటూ ఉంది. అంతేకాదు తండ్రి మనసు మాదిరిగానే తనకి కోట్లాది రూపాయలు వచ్చిన ఫస్ట్ రెమ్యూనరేషన్ కూడా క్లారిటీ చేయడం జరిగింది. చిన్న వయసులోనే అత్యంత విలువైన ఆలోచనలు కలిగిన సితారనీ మహేష్ మరియు నమ్రత ప్రోత్సహించడానికి గల కారణం ఏంటనేది ఇప్పుడు ఇండస్ట్రీలో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి కుటుంబం విషయంలో మహేష్ చాలా ప్రైవసీగా ఉంటాడు.
సినిమాలు అభిమానులు అనేది కేవలం ప్రొఫెషనల్ గా చూస్తాడు. కుటుంబానికి మాత్రం చాలా పెద్దపీట వేస్తూ ఉంటాడు. అయితే కూతురిని ఈ రకంగా మహేష్ ప్రోత్సహించడం వెనకాల ఒక బిగ్ ప్లాన్ ఉన్నట్లు వార్త వినపడుతుంది. మేటర్ లోకి వెళ్తే మహేష్ బాబు హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేసే ముందు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ఈరకంగానే అతని హైలెట్ చేయడం జరిగిందంట. అనంతరం హీరోగా ఎంట్రీ ఇచ్చి మహేష్ సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు అదే ఫార్ములా కూతురు సితార విషయంలో మహేష్ ఫాలో అవుతున్నాడనే ప్రచారం జరుగుతోంది.