జగతిబాబు కూతురు, మహేష్ పై చేసిన వ్యాఖ్యలకి బిత్తరబోయిన మహేష్ బాబు?

జగతిబాబు, మహేష్ బాబు మధ్య వున్న సంబంధం గురించి అందరికీ తెలిసిందే. ‘శ్రీమంతుడు’ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు తండ్రిగా సీనియర్ కథానాయకుడు జగపతి బాబు నటించి ఘట్టమనేని అభిమానులకు దగ్గరయ్యారు. ఆనాటినుండి వీరిద్దరి మధ్య మంచి బంధం పెనవేసుకుంది. ఆ సినిమాలో కన్న కుమారుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే తండ్రిగా, సొంతూరు అభివృద్ధి కోసం శ్రమిస్తున్న కుమారుడి పాత్రలో మహేష్ బాబు ఇరగదీశారని చెప్పుకోవచ్చు.

దాంతో ‘శ్రీమంతుడు’ తర్వాత ‘మహర్షి’లో కూడా జగపతి బాబు గారు నటించారు. కాగా ఆ సినిమాలో ఆయనది విలన్ క్యారెక్టర్. ఆ తరువాత ఇప్పుడు తాజాగా మహేష్ బాబుతో హ్యాట్రిక్ సినిమా చేస్తున్నారు మన ఫామిలీ హీరో జగపతిబాటు. మహేష్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న తాజా సినిమాలో జగపతి బాబు ఓ కీలక పాత్ర పోషించడం జరుగుతోంది. మహేష్ బాబుతో మాత్రమే కాకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కూడా జగపతి బాబుది సూపర్ హిట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంలో ప్రతినాయకుడు బసిరెడ్డి పాత్రలో జగపతిబాబు చూపించిన విలనిజం అంతాఇంతా కాదు. అందుకే మారలా త్రివిక్రమ్ శ్రీనివాస్ జగపతిబాబు గారినే ఓటేశారు. అయితే ప్రస్తుతం మహేష్ కాంబినేషన్ సినిమాలో జగపతి క్యారక్టర్ ఏమిటనేది మాత్రం ఇంకా రివీల్ కాలేదు. కాగా ప్రస్తుతం షూటింగ్ లో వారు బాగా ఎంజాయ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఓ విషయంలో మహేష్ బాబు విషయమై జగపతిబాబు గుర్రుగా వున్నారని టాక్.

విషయం ఏమంటే జగపతిబాబే ఓ పెద్ద హీరో. అలాంటిది అతని కడుపున పుట్టిన చిన్న కూతురుకి హీరో మహేష్ బాబు అంటే ఇష్టమైతే ఎవరికన్నా కాలుతుంది మరి. ఇక ఈ విషయం మహేష్ బాబు దగ్గర చెప్పుకొని మన ఫామిలీ హీరో, విలన్ జగపతి బాబు ఫీల్ అయ్యారట.


ఆ విషయం వినగానే మహేష్ బాబు కూడా ఒక్కసారి షాక్ అయిపోయాడట. ఇకపోతే పూజా హెగ్డే, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్న మహేష్ తాజా చిత్రం హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకం మీద సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న విడుదల కానుంది.