సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే విధంగా అతని గారాల పట్టి సితార గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సితార పాప.. రీసెంట్‌గా ఇంటర్నేషనల్ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా మారిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో అమెరికాకు చెందిన ప్రముఖ ఇంటర్నేషనల్ బ్రాండ్ పీఎంజే జ్యూవెల్లరీ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా ఎంపికైంది. చిన్న వయసులోనే మహేశ్ బాబు కూతురు ఇంత విజయాన్ని సాధించడంతో మహేష్ – నమ్రత దంపతులు ప్రస్తుతం పుత్రికోత్సాహంలో మునిగితేలుతున్నారు.
గత రెండు మూడు రోజులుగా న్యూయార్క్ టైం స్క్వేర్ స్ట్రీట్‌లో సితార హోర్డింగ్స్ కి సంబందించిన ఫోటోలు అయితే సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. అవును, ప్రస్తుతం సితార చిన్న హీరోయిన్లుకు పోటీగా రెమ్యునరేషన్ తీసుకుంటుందని కూడా ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఆమె చేసిన సదరు యాడ్ కి గాను ఏకంగా కోటి రూపాయిలు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సమాచారం బయటకి పొక్కడంతో ఘట్టమనేని అభిమానులు మా సితార పాప ఏకంగా తండ్రినే మించిపోయిందని తెగ పొగిడేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ఇంకో విషయం ఏమంటే, సితార ‘మిస్ యూనివర్స్’, ‘మిస్ వరల్డ్’ పోటీలకు సైతం సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తల్లి నమ్రతా శిరోద్కర్ కూడా 1993లో మిస్ ఇండియాగా ఎంపికైన విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే సితార పాప తల్లిని ఫాలో అవుతున్నట్లు ప్రచారం చాలా గట్టిగా జరుగుతోంది. అయితే పోటీల్లో పాల్గొనేందుకు ఇంకాస్తా సమయం పడుతుందని.. దానికి కావాల్సిన అర్హతలు సితార సాధించాల్సి ఉందని కొంతమంది అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. ఈ విషయం ఇంకా అధికారికంగా వెలువడాల్సి వుంది. అంతేకాకుండా సితార నటిగా పరిచయమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని కొంతమంది జోష్యం చెబుతున్నారు.
ఇక అసలు విషయంలోకి వెళితే… ఇటీవలే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి విదితమే. అయితే ఆల్రెడీ మహేష్ బాబు మెగా ప్రిన్స్ ని అపోలో ఆసుపత్రికి వెళ్లి చూసినప్పటికీ, కూతురు సితార కోరిక మేరకు మరోసారి రామ్ చరణ్, ఉపాసన ఇంటికి వెళ్లి మెగా ప్రిన్స్ ని పలకరించారని తెలుస్తోంది. దాంతో మహేష్ రెండో సారి వచ్చినందుకు చరణ్, ఉపాసన దంపతులు ఆనందంతో తబ్బుబ్బి అయిపోయారట. ఇక చరణ్, మహేష్ బాండింగ్ గురించి అందరికీ తెలిసినదే. మంచి, చెడులకు ఒకరికొకరు పలకరించుకుంటూ వుంటారు. ఈ పరంపర మెగాస్టార్, సూపర్ స్టార్ నుండి కొనసాగుతుండడం విశేషం.