సూపర్ స్టార్ మహేష్ బాబుకి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. అందుకే అగ్రికల్చర్‌కి సంబంధించిన సినిమాలు కూడా తీశాడు. ఇక వ్యవసాయంలో రైతులకు అండదండగా నిలిచే ఆవులన్న అతనికి ఇష్టమే. అందుకే బుర్రిపాలెంలోని ఒక ఇల్లు కట్టినప్పుడు ఆ ఇంటి గృహప్రవేశానికి కొన్ని ఆవులను తీసుకొచ్చాడు. వాటిలోని ఒక ఆవు దూడతో కాసేపు గడిపాడు. ఆ దూడ కొంచెం ప్రత్యేకంగా కూడా కనిపించేది. అందుకే దానికి మహేష్ అట్రాక్ట్ అయ్యాడు. గృహప్రవేశం అయిపోయిన తర్వాత కూడా దానిని వదల్లేక మహేష్ వెళ్ళిపోయాడట.
అయితే రీసెంట్ గా బుర్రిపాలెం వెళుతుండగా అతనికి రోడ్డుపై ఆ ఆవు చాలా దయనీయ పరిస్థితుల్లో కనిపించిందట. అంతే వెంటనే అతను కారవ్యాన్ ఆపి మరీ దాని దగ్గరికి వెళ్ళాడట. అంతే కాదు దానిని ప్రేమతో నిమురుతూ నీకు ఈ పరిస్థితి వచ్చిందా అని అంటూ ఎమోషనల్ అయ్యాడట. అది చాలాదన్నట్టు దానిని గోశాలకు తీసుకువెళ్లాలని తనతో వచ్చిన వారికి చెప్పాడట. ఆ తర్వాత కూడా దాని బాగోగులు చూసుకుంటున్నట్లు సమాచారం.
మహేష్ కి కుక్కలన్నా చాలా ఇష్టమట. అతను మూగజీవులు బాధతో కనిపిస్తే అసలు తట్టుకోలేడు. సన్నిహితుల ప్రకారం మహేష్ జంతువులను బాధపెట్టే సినిమాలను కూడా చూడలేడట. అంత మంచి మనసుతోనే తాను కొన్నేళ్ల క్రితం పరిచయం చేసుకున్న ఆవును ఇప్పటికే గుర్తు పెట్టుకుని దాని బాగోగులను చూసుకుంటున్నాడు. అయితే దీనికి సంబంధించిన ఫొటోలు, అలాగే వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇది తెలిసి మహేష్ అభిమానులు గర్వంగా ఫీల్ అవుతున్నారు.