తండ్రిమీద ప్రేమ చాటుకున్న మహేష్… వికలాంగులకు లక్ష స్కూటీలు పంపిణీ?

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు మే 31వ తేదీ అంటే చాలా ప్రత్యేకత. ప్రతి సంవత్సరం తన తండ్రి దివంగత సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్బంగా కొత్త సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ అనేది ఇవ్వడం పరిపాటిగా మారింది. అయితే.. కృష్ణ మరణించిన తరువాత వచ్చిన మొదటి పుట్టినరోజున అభిమానులకు ‘మోసగాళ్లకు మోసగాడు’రీ రిలీజ్‌ సందర్భంగా ప్రిన్స్ ఓ ఎమోషనల్ పోస్ట్ చేసారు. ఈ పోస్ట్ చూసిన ఘట్టమనేని అభిమానులు కూడా చాలా ఎమోషనల్ అవుతున్నారు.

ఈ సందర్భంగా మహష్ “నాన్నగారి వీరాభిమానుల్లో నేను కూడా ఒకణ్ణి కావడం నా అదృష్టం. ఆయన నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ అంటే చాలా ప్రత్యేకమైన అభిమానం. ఆ రోజుల్లోనే హాలీవుడ్ స్థాయిలో తెలుగు చిత్రాన్ని నిర్మించి, విజయవంతం చేసిన సాహసి నాన్నగారు. ఈ రోజు ( మే 31) బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను 4K టెక్నాలజీతో ప్రపంచ వ్యాప్తంగా రీ రిలీజ్ చేసాము. ఈ క్రమంలో దీనికి అభిమానులనుండి వచ్చిన రెస్పాన్సు చూసి మా కుటుంబం చాలా ఎమోషనల్ అయ్యాము. అభిమానులకి ఎప్పటికీ రుణపడి ఉంటాము.” అని రాసుకొచ్చారు.

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇకపోతే, సూపర్ స్టార్ కృష్ణ గారు తెలుగు సినిమాకు విజనరీ అని చెప్పుకోవచ్చు. మొదటి స్టీరియో ఫోనిక్ సౌండ్, మొదటి సినిమా స్కోప్, మొదటి 70 MM, మొదటి జేమ్స్‌బాండ్ వంటి ఎన్నో కొత్త హంగులను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన ఘనత కృష్ణగారిదే అవుతుంది. కాగా ఒకప్పుడు తెలుగులో పాత సినిమాలు రీ రిలీజ్‌లు ఉండేవి. నేడు శాటిలైట్, డిజిటల్ ఎంట్రీతో వీటి దూకుడు తగ్గింది. తాజాగా గత కొన్ని రోజులుగా తెలుగులో పాత సినిమాల రీ రిలీజ్ అనే ట్రెండ్ మళ్లీ మొదలైందని చెప్పుకోవచ్చు.

ఈ క్రమంలో సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన ఈ సినిమాని 4Kలో మరోసారి విడుదల చేయడం అభినందనీయం. ఇపుడు మనమందరం ప్యాన్ ఇండియా, ప్యాన్ వరల్డ్ మూవీ గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ కృష్ణ 52 యేళ్ల క్రితమే ప్యాన్ వరల్డ్ మూవీ చేసారు. ఆ సినిమానే ‘మోసగాళ్లకు మోసగాడు.’ ఇక అసలు విషయానికెళితే, మన జూనియర్ సూపర్ స్టార్ మహేష్ తండ్రిమీద ప్రేమతో.. ఆయన మొదటి జయంతి సందర్భంగా వికలాంగులకు లక్ష స్కూటీలు పంపిణీ చేయబోతున్నారు అనే వార్త ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దీనిపైన ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోవడం గామానార్హం.