మహేష్ బాబు చుట్టూ వున్న భద్రతని చూసి బిత్తరబోయిన మంత్రి రోజా?

సీనియర్ నటి, మంత్రి రోజా గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తెలుగుతో పాటు క‌న్న‌డ‌, త‌మిళం, మ‌ల‌యాళం భాష‌ల్లో 100కు పైగా సినిమాల్లో నటించి మంచి నటిగానే కాకుండా మంచి డాన్సర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. ఈ క్రమంలో ఆంధ్ర రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రోజా నగరి నియోజకవర్గం నుండి ఏకంగా 2 సార్లు శాసనసభ్యురాలిగా ఎన్నిక కావడం విశేషం. 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం అందరికీ తెలిసినదే.

ఇకపోతే, రోజా గురించి చాలామందికి తెలియని విషయం ఒకటుంది. అదే ఆమె అసలు పేరు శ్రీలతా రెడ్డి అని. సినిమాలలోకి వచ్చిన తరువాత దర్శకుడు రాఘవేంద్రరావు ఆమెకి రోజా అనే పేరుని సూచించాడని చెబుతూ వుంటారు. ఇక హీరో మహేష్ బాబుని ఇష్టపడివారు ఇక్కడ ఎవరుంటారు చెప్పండి. ఆమె ఆమె ఫాన్స్ లో రోజా కూడా చేరిపోయిది. చాలా సంవత్సరాలనుండి సినీ పరిశ్రమకు దూరమైన రోజా ఓ సందర్భంలో మాట్లాడుతూ… మరలా నేను సెకండ్ ఇన్నింగ్స్ ట్రై చేస్తే, సూపర్ స్టార్ మహేష్ కి అత్తగా నటిస్తానని చెప్పుకుంటూ వచ్చింది. ఈ విషయం వైరల్ కావడంతో ఘట్టమనేని అభిమానులు ఖుషీ అయిపోతున్నారు.

అసలు విషయంలోకి వెళితే, ఏపీకి మంత్రి అయినటువంటి రోజా మన సూపర్ స్టార్ ఫాలోయింగ్ చూసి స్టన్ అయిపోయింది. అవును, తాజాగా మహేష్, రోజా బయట ఓ సందర్భంలో ఎదురెదురు పడగా హాయిగా పలకరించుకున్నారు. ఆ తరువాత మహేష్ చుట్టూ వున్న బాడీ గార్డ్స్ ని చూసిన రోజా బిత్తరబోయింది. ఎందుకంటే? మంత్రి అయినటువంటి రోజా సెక్యూరిటీతో పోలిస్తే ఇక్కడ మహేష్ సెక్యూరిటీనే ఎక్కువగా వుంది. దాంతో ఆమె రెండుకళ్ళూ పెద్దవి చేసుకొని అలా చూస్తూ ఉండిపోయింది.

ఈ విషయం ఇపుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. కాగా దీనిని ఉద్దేశిస్తూ ప్రిన్స్ అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ‘మా సూపర్ స్టార్ కి వున్న స్టార్ ఇమేజ్ ఒక రాజకీయ నాయకుడికి కూడా ఉండదు’ అని కొందరంటుంటే… ‘ప్రిన్స్ అంటే ఏమాత్రం ఉంటుంది కదా రోజా ఆంటీ’ అని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక మహేష్ – తివిక్రమ్ కాంబోలో నిన్న వచ్చిన ‘గుంటూరు కారం’ ఫస్ట్ స్ట్రైక్ అభిమానులకు తెగ నచ్చేసిన విషయం విదితమే.