పుత్రికోత్సాహంతో పొంగిపోతున్న మహేష్ బాబు… టైమ్స్ స్క్వేర్ లో మెరిసిన సితార!

అవును, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుత్రికోత్సాహంతో పొంగిపోతున్న క్షణాలివి. కడుపున పుట్టిన పిల్లలు ఏమైనా సాధిస్తే ఏ తల్లిదండ్రులకు మాత్రం ఆనందం కలగదు? ప్రస్తుతం మహేష్ బాబు – నమ్రత అలాంటి ఆనందంలోనే మునిగి తేలుతున్నారు. పదేళ్ల చిరు ప్రాయంలోనే సితార ఘట్టమనేని ఫేమ్ మరియు సంపాదనలో తండ్రికి తగ్గ తనయగా దూసుకుపోతుంది. ఇటీవల సితార ఓ ఇంటర్నేషనల్ జ్యూవెలరీ బ్రాండ్ కి అంబాసిడర్ గా చేసిన సంగతి విదితమే. సితార పీఎంజే జ్యూవెలరీ బ్రాండ్ యాడ్ షూట్ లో తాజాగా పాల్గొన్నారు. ఈ క్రమంలో న్యూయార్క్ టైం స్క్వేర్ స్ట్రీట్ లో సితార హోర్డింగ్స్ భారీఎత్తున ప్రదర్శించడం జరిగింది.

దాంతో అక్కడ ప్రఖ్యాత స్ట్రీట్లో సితార ఫోటోలు దర్శనమివ్వడంతో మహేష్ బాబు మరియు నమ్రత పుత్రికోత్సాహంతో మురిసిపోయారు. ఈ మేరకు ఇంస్టాగ్రామ్ లో స్పందించారు. మన సూపర్ స్టార్ ఈ విషయమై స్పందిస్తూ… ‘టైం స్క్వేర్ స్ట్రీట్ లో వెలిగిపోతున్నావు. చాలా గర్వంగా ఉంది సీమటపాకాయ్. నువ్వు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను.’ అంటూ కామెంట్ చేయడం జరిగింది. దాంతో మహేష్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక ఘట్టమనేని అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సోషల్ మీడియాలో సదరు ఫోటోలు షేర్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు.

ఇకపోతే, సితార గురించి ఇక్కడ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మహేష్ గారాలపట్టి గురించి అభిమానులకు బాగా తెలుసు. ఛిన్నప్పటినుండే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండేది. పదేళ్ల ప్రాయంలోనే ఈ స్టార్ కిడ్ లక్షల మంది ఫాలోవర్స్ సంపాదించింది. సితార తరచుగా డాన్స్ వీడియోలు అందులో షేర్ చేస్తుంటారు. అప్పుడప్పుడు పాటలు పాడుతుంది కూడా. ఈ క్రమంలోనే కేవలం మహేష్ బాబు కూతురుగానే కాకుండా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల సితార లవ్ స్టోరీ మూవీలోని ‘సారంగదరియా’ సాంగ్ కి డాన్స్ చేయగా ఆ పాట మిలియన్స్ వ్యూస్ సంపాదించింది.

సితార డాన్సులు విషయానికొస్తే యానీ మాస్టర్ వద్ద శిక్షణ తీసుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సితార చిన్నప్పటి నుండే కళలపై మక్కువ పెంచుకుంటూ, వాటిని అభ్యసిస్తూ తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటున్నారు. త్వరలో సితార సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చే ఆస్కారం ఉందంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు. ఇకపోతే సర్కారు వారి పాట మూవీలో ‘పెన్నీ’ సాంగ్ ప్రమోషనల్ వీడియోలో సితార నటించిన విషయం తెలిసిందే. పిల్లలను ప్రాణంగా ప్రేమించే మహేష్ వారికి ఇష్టమైన రంగాల్లో చాలా బాగా ప్రోత్సహిస్తారు అనడానికి ఇదే ఒక ఉదాహరణ. సాధారణంగా మారే సెలిబ్రిటీ అయినా ఇలా ఛిన్నప్పటినుండే తమ పిల్లలను ఎక్సపోజ్ చేయరు. చాలామంది తమ కుటుంబాన్ని కెమెరాకు చాలా దూరంగా ఉంచుతారు. అయితే ఈ విషయంలో మహేష్ పూర్తిగా భిన్నం అని చెప్పుకోవాలి.