Mahesh Babu : మహేష్ బాబుతో మూవీ పై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి..!

Mahesh Babu :రాజమౌళి జస్ట్ ఒక పేరు కాదు ఇప్పుడు ఒక బ్రాండ్ గా మారిపోయింది ఆస్కార్ అవార్డు సాధించిన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడ చూసినా ఆయన పేరే వినిపిస్తూ ఉండడం గమనార్హం.ఆర్ఆర్ఆర్ సినిమాతో సృష్టించిన ప్రభంజనం తదుపరిచిత్రంపై భారీ బజ్ క్రియేట్ చేస్తోందని చెప్పాలి. ఈ క్రమంలోనే రాజమౌళి , మహేష్ బాబు తో ఆఫ్రికన్ అడవుల్లో అడ్వెంచర్స్ మూవీ చేస్తున్నామని గతంలో హింట్ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే . ఈ విషయం తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు . ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా తీసుకొచ్చిన క్రేజ్ మహేష్ బాబు మూవీకి బాగా పనికొస్తుందని చెప్పాలి.

Advertisement
Mahesh Babu movie clarity on rajamouli
Mahesh Babu movie clarity on rajamouli

నిన్నటి వరకు అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వీధుల్లో తెగ సందడి చేసిన ఆర్ఆర్ఆర్ టీం ఈరోజు హైదరాబాదుకు చేరుకొని అక్కడి విషయాలను కూడా వెల్లడించారు. అందులో భాగంగానే రాజమౌళి తన తదుపరిచిత్రంపై అప్డేట్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే సినిమా షూటింగ్ మొదలుకానున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఏడాది చివరికల్లా సినిమా షూటింగ్ మొదలు కావాల్సి ఉంది కానీ మహేష్ బాబు ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన 28వ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే కొంతవరకు షెడ్యూల్ కూడా పూర్తయిన ఈ సినిమా ఆగస్టు లో విడుదలకు సిద్ధమవుతోంది. అనంతరం రాజమౌళితో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు మహేష్ బాబు.

Advertisement

ఇకపోతే ఇటీవల ఒక వేడుకలో పాల్గొన్న రాజమౌళిని మహేష్ బాబు తో సినిమా ఎప్పుడు ఉంటుందని యాంకర్ సుమ అడగగా స్క్రిప్ట్ విషయాలన్నీ మీ దగ్గర ఉన్నాయని మాకు తెలుసు. కాకపోతే అవన్నీ ఇప్పుడే రివిల్ చేయలేము. కానీ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు మాత్రం సుమానే యాంకర్ అంటూ తెలిపారు రాజమౌళి. . దాంతో నాకు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి త్వరగా పెట్టేయండి అంటూ చమత్కరించింది సుమా.

Advertisement