అసలు విషయం దేవుడికెరుకగానీ, తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రధాని మోడీని కలిసినట్టు వార్తలు సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తెలిసి ఘట్టమనేని అభిమానుల ఆనందానికి అవధులు లేకండా పోతోంది. ఎలాంటి పార్టీలకు సంబంధం లేకపోయినప్పటికీ ప్రధాని మోడీ మహేష్ ని ఆహ్వానించారని చెప్పుకుంటూ తెగ ఖుషీ అవుతున్నారు. అయితే వారి కలయిక విషయం పెరుమాళ్ళకెరుకగానీ రకరకాల ఊహాగానాలు ప్రజలలో మొదలయ్యాయి.
ఈ విషయం తెలిసిన జగన్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. దాంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు గుస్సాగా ఉన్నట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో గుప్పుమన్న విషయం ఏమంటే, జనసేన - బీజేపీ మధ్య వారధిగా ఉండేందుకు మహేష్ అక్కడికి వెళ్లినట్టు సమాచారం. సినిమా పరిశ్రమలో జనసేనకు ఎవరూ తెలుపని మద్దతు ఇపుడు మహేష్ నుండి బాగా ఉందని తెలిసి అందరూ అవాక్కవుతున్నారు.
ఇకపోతే మన సూపర్ స్టార్ - పవర్ స్టార్ రిలేషన్ అందరికీ తెలిసిందే. వీరిమధ్యన ఎలాంటి భేషజాలు వుండవు. ఒకరి సినిమాలను మరొకరు చూస్తూ మద్దతు తెలుపుకుంటారు. దాంతో వీరిరువురి ఫాన్స్ మధ్య కూడా ఎప్పుడు వార్స్ అనేవి జరగవు. కాగా ఇపుడు మహేష్ జనసేనకు మంచి సపోర్ట్ ఇస్తున్నారని తెలిసి మెగా పవన్ ఫాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
ఇక వీరిరువురి సినిమాల విషయానికొస్తే, పవన్ దాదాపుగా మూడు నాలుగు సినిమాలతో బిజీగా ఉంటే, మహేష్, త్రివిక్రమ్ సినిమాని పూర్తి చేసే పనిలో వున్నాడు. ఆ తరువాత దర్శక ధీరుడు రాజమౌళి సినిమాకోసం సంసిద్ధమౌతాడు. కాగా ఆమధ్య రిలీజైన ఫస్ట్ లుక్ విషయమై విశేష స్పందన వచ్చిన విషయం తెలిసినదే. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ సినిమా 'బ్రో'కి సమందించిన ఫస్ట్ లుక్ ఎలాంటి ప్రభంజనాలు సృష్టిస్తుందో అందరికీ తెలిసినదే.