Mahesh Babu.. సాధారణంగా మహేష్ బాబు ఏ లుక్ లో కనిపించినా సరే అభిమానుల ఆనందాలకు అవధులు ఉండవు.. అలాంటిది ఆయన ప్రత్యేకించి తన లుక్ పై ఫోకస్ పెట్టి మరీ ఫోటోలు షేర్ చేశారంటే ఇక తట్టుకోవడం కష్టమే. ఇకపోతే ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అలియాస్ గురూజీ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అతడు, ఖలేజా వంటి సినిమాలు వీరి కాంబినేషన్లో వచ్చాయి. అయితే ఇప్పుడు మూడోసారి రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి.
మహేష్ బాబు ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. హీరోయిన్గా బుట్ట బొమ్మ పూజ హెగ్డే నటిస్తోంది. ఈమెతో పాటు భూమి పడ్నేఖర్, శ్రీ లీలా కూడా భాగం పంచుకోనున్నారు. ఈ పిక్చర్ లో భారీ యాక్షన్ సీన్స్ త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం మహేష్ బాబు కూడా అంతే రీతిలో కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జిమ్ లో మహేష్ బాబు కసరత్తు చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి ఇప్పుడు చాలా వైరల్ గా మారుతున్నాయి ..మహేష్ కొత్త లుక్ చూసి అభిమానులు సంబరపడిపోతున్నారు.
📸🔥🔥🔥 pic.twitter.com/hb4XrTgkem
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) March 2, 2023