తెలుగు తెర సూపర్ స్టార్ కృష్ణకు నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు అనతికాలంలోనే తండ్రికి తగ్గ తయనుడు అనిపించుకుని సూపర్ స్టార్ వారసత్వాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. అయితే, మహేష్ బాబు పుట్టకమునుపే జన్మించిన రమేష్ బాబు తండ్రి సినిమా నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవాలనుకున్నాడు కానీ, అనుకున్నంతగా అది సాధ్యపడలేదు. కృష్ణ హీరోగా తొలి సినిమా ‘తేనె మనసులు’ ప్రారంభమయ్యేనాటికే ఇందిరతో వివాహం అయింది.
తరువాత సరిగ్గా 1965 అక్టోబర్ 13 పెద్ద కొడుకు రమేష్ బాబు వారికి పుట్టాడు. కాగా కృష్ణ, ఇందిరలకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. పెద్ద కొడుకు రమేష్ బాబు హీరోగా కొన్ని సినిమాల్లో పనిచేసినప్పటికీ అంతగా రాణించలేదు. దాంతో అతగాడు సినిమా నిర్మాణం వైపు దృష్టి సారించాడు. ఇక 1987-90 మధ్యకాలంలో దాదాపు తన 7 సినిమాల్లో బాలనటుడిగా నటించిన రెండో కొడుకు మహేష్ బాబు 1999లో రాజకుమారుడు సినిమాతో పరిచయం అయ్యి అనతికాలంలోనే తండ్రికి తగ్గ తయనుడు అనిపించుకుని తండ్రి నట వారసత్వాన్ని నిరాటంకంగా నేటికీ కొనసాగిస్తున్నాడు.
ఇక దురదృష్టవశాత్తు రమేష్ బాబు 2022 నవంబరు 15న కార్డియాక్ అరెస్ట్ కారణంగా హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కృష్ణ తన జీవితంలోని ఆఖరి మూడు సంవత్సరాల వ్యవధిలో రెండవ భార్య విజయనిర్మల, పెద్ద కొడుకు రమేష్ బాబు, మొదటి భార్య ఇందిరా దేవి వరుస మరణాలు చూడవలసి వచ్చింది. ఇక ఆ తరువాత సూపర్ స్టార్ కృష్ణ కూడా 15 నవంబర్ 2022న స్వర్గస్థులయ్యారు. దాంతో యావత్ తెలుగు సినిమా ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది.
ఇకపోతే మహేష్ బాబు తరువాత అతని వారసుడు అయినటువంటి గౌతమ్ సినిమా హీరోగా త్వరలో పరిచయం అవుతాడు అని అందరు అనుకున్న తరుణంలో ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరొక సూపర్ స్టార్ రాబోతున్నాడు. అతని మరెవరో కాదు, మహేష్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు. అవును, అతగాడి పేరు జయకృష్ణ. ఘట్టమనేని కాంపౌండ్ నుంచి జయకృష్ణ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా అతగాడి బాధ్యతలు మన సూపర్ స్టార్ మహేష్ బాబు తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.