త్వరలో జబర్దస్త్ షోలో జడ్జిగా మహేష్ బాబు ఎంట్రీ… మామ్ములుగా ఉండదు?

జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రజలకు చెప్పాల్సిన పనిలేదు. మల్లెమాల సంస్థ 2013లో ప్రయోగాత్మకంగా స్టార్ట్ చేసిన ఈ షో అనతికాలంలో అత్యంత ప్రజాదరణ పొందింది. రోజా, నాగబాబు జడ్జెస్ట్ గా, అనసూయ యాంకర్ గా ఈ షోలో దుమ్ము లేపేవారు. చలాకీ చంటి, చమ్మక్ చంద్ర, రోలర్ రఘు, ధనాధన్ ధన్ రాజ్, టిల్లు వేణు, రాకెట్ రాఘవ, షకలక శంకర్ టీం లీడర్స్ గా మొదలైన ఈ షోకు ఊహించని స్థాయిలో రేటింగ్స్ వచ్చాయి. ఈ క్రమంలో కొందరికి సినిమా అవకాశాలు కూడా వచ్చాయి.

తరువాత కాలంలో సుడిగాలి సుధీర్, హైపర్ ఆది టీమ్స్ అయితే ఈ వేదికపైన సంచలనాలు సృష్టించారని చెప్పుకోవాలి. ఇదే మంచి తరుణం అనుకొని ఎక్స్ట్రా జబర్దస్త్ అంటూ మరో షో స్టార్ట్ చేశారు. గురు, శుక్రవారాల్లో ప్రసారమయ్యే ఈ రెండు షోలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలో కమెడియన్స్ మాత్రమే కాకుండా రష్మీ, అనసూయల దశ కూడా తిరిగింది. ఇలా జబర్దస్త్ షో చరిత్ర చెప్పుకుంటూ పొతే పెద్ద పుస్తకమే అవుతుంది. అయితే క్రమ క్రమంగా జబర్దస్త్ షో తన ప్రాభవం కోల్పోతూ వచ్చింది.

మొదట నాగబాబు జడ్జిగా నిష్క్రమించడంతో, ఆ వెనకే హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను లాంటి టాలెంటెడ్ కమెడియన్స్ బయటకి వచ్చేసారు. తరువాత జడ్జి రోజా, యాంకర్ అనసూయ కూడా తమ వ్యక్తిగత కారణాలతో ఈ షోనుండి తప్పుకున్నారు. ఈ క్రమంలో మంచి కాంబినేషన్ తో కూడిన పాత టీమ్స్ విచ్ఛన్నమయ్యాయి. అందుకే ఈమధ్య కాలంలో ఈ షోకి పూర్వవైభవం తీసుకు రావాలని సినిమా సెలిబ్రిటీలను ఆహ్వానించడం మొదలు పెట్టారు.

Advertisement

ఈ క్రమంలోనే మన సూపర్ స్టార్ మహేష్ బాబుని ఈ షోకి ఆహ్వానించి ఒక్కరోజు జడ్జి షీట్లో కూర్చోబెడితే ఎలా వుంటుందనే ఆలోచన మళ్ళేవాళ్ళు చేస్తున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. ఆ క్రమంగా ప్రయత్నాలు కూడా మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ కాంబోలో సినిమా చేస్తున్న మహేష్ దీనికి ఒప్పుకుంటారో లేదో చూడాలి మరి.

Advertisement
Advertisement