తండ్రికి తగ్గ తనయగా మహేష్ బాబు కూతురు… ఓ యాడ్ చేయడం కోసం భారీగా ముట్టజెప్పారట!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార గురించి అందరికీ తెలిసిందే. అంత సూపర్ స్టార్ కూతురైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుంటూ సామాన్యులకు కూడా అందుబాటులో ఉంటుంది. తన తండ్రి మహేష్ బాబుకు తీసిపోని విధంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను చిన్నప్పుడే సొంతం చేసుకుంది సితార. తరుచుగా తాను నృత్యం చేసే వీడియోలతోపాటు అందమైన చిత్రాలను కూడా ఇక్కడ షేర్ చేస్తుంటుంది. ఈ క్రమంలో ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ లో తనకంటూ భారీసంఖ్యలో ఫాలోవర్స్ ను సంపాదించుకుంది.

తాజాగా సితార కూడా తండ్రి బాటలోనే బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. ప్రముఖ జ్యూవెలరీ సంస్థ పీఎంజే తన బ్రాండ్ అంబాసిడర్ గా బుల్లి ప్రిన్స్ సితారను నియమించుకోవడం విశేషం. తాజాగా ఈ జ్యువెలరీ బ్రాండ్ తన ప్రమోషనల్ యాడ్ ఫోటో షూట్ ను సితారతో చేయడం విశేష. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో సితార షేర్ చేయగా వాటికి విశేష స్పందన వస్తోంది. అతి త్వరలోనే ఈ ప్రకటన బయటకు రాబోతోంది కూడా. కాగా ఈ విషయం తెలిసిన ఘట్టమనేని అభిమానులు ఖుషి అయిపోతున్నారు.

ఇక ఈ యాడ్లో నటించేందుకు సితారకు పీఎంజే జ్యువెలరీస్ సంస్థ భారీగానే ముట్టజెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కొన్నాళ్ల క్రితం మహేష్ బాబు, నమ్రతతో కలిసి ఒక కమర్షియల్ యాడ్ లో నటించిన సితార ఇప్పుడు ఏకంగా ఓ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా మారడం హాట్ టాపిక్ గా మారింది. యూట్యూబ్, ఇన్ స్టా ద్వారా డబ్బు సంపాదిస్తున్న సితార ఇప్పుడు నెక్ట్స్ లెవల్ అన్నట్లుగా బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. ఒకరకంగా ఇది రికార్డ్ అనే చెప్పాలి. రాబోయే రోజుల్లో ఈ ఘట్టమనేని నట వారసురాలు ఎన్ని యాడ్లు చేస్తుందో? ఇంకెంత సంపాదిస్తుందో? చూడాలి మరి.

ఇకపోతే, మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్టు భోగట్టా. ఈ క్రమంలో రషెష్ చూసిన కొందరు టాలీవుడ్ ప్రముఖులు అవుట్ ఫుట్ అదరిపోయిందని చెప్పినట్టుగా గుసగుసలు వినబడుతున్నాయి. కాగా ఇది మహేష్ బాబు అభిమానులకు మంచి మాస్ ట్రీట్ ఇవ్వబోతోంది టాక్ నడుస్తోంది. ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్ప్స్ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు.