మెగా ప్రిన్స్ అదిరిపోయిందంటూ ఆకాశానికెత్తేస్తున్న మహేష్ బాబు?

రాంచరణ్ – ఉపాసనల సుదీర్ఘ కల మొన్నటితో నెరవేరింది. ఈ దంపతులకు 2012లో వివాహం కాగా చాలా కాలం తరువాత పండంటి ఆడబిడ్డకి వారు జన్మనిచ్చారు. దాంతో మెగా కాంపౌండ్లో సంబరాలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంలోనే వీరిద్దరికి సంబంధించిన పలు విషయాలను తెలుసుకోవడానికి ముఖ్యంగా మెగాభిమానులు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ఇక్కడ ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అదేవిధంగా ఉపాసనకు కూడా ఒక ప్రత్యేక స్థానముంది. తన వ్యక్తిత్వంతో ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది ఉపాసన. అపోలో ఆస్పత్రి పనులతోపాటు తన సొంత వ్యాపారాల్లో కూడా బిజీగా రాణిస్తోంది.

అపోలో వారసురాలు అయినటువంటి ఉపాసన విదేశాల్లో ఇంటర్నేషనల్ బిజినెస్ మార్కెటింగ్ అండ్ మేనేజ్ మెంట్ లో డిగ్రీ పట్టా పుచ్చుకున్న సంగతి అందరికీ విదితమే. చదువు పూర్తి అయిన వెంటనే వ్యాపార రంగంలో అడుగుపెట్టి మంచి పేరు ప్రఖ్యాతలు గడించారు. ప్రస్తుతం అపోలో ఆసుపత్రి వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరోవైపు బి పాజిటివ్ అనే మ్యాగజైన్ ఇన్ చార్జిగా కూడా ఉపాసన రాణిస్తున్నారు. ఎంత సంపాదన ఉన్నప్పటికీ ఉపాసన చాలా నిరాడంబరంగా ఉండటంతోపాటు బంధాలకు చాలా ఎక్కువ విలువనిస్తారు. వీలైనప్పుడు జనాలకి మంచి కౌన్సిలింగ్ పాఠాలు కూడా చెబుతూ వుంటారు ఈ మెగా కోడలు.

ఉపాసనకి కెరీర్ మీద చాలా స్పష్టమైన అవగాహన ఉంటుంది. పెళ్లి అయిందే తడవుగా చాలామంది ఆమెను రకరకాలుగా ట్రోల్స్ చేసిన సంగతి అందరికీ విదితమే. ఇంకా బాడీ షేమింగ్ కూడా చేసారు. రామ్ చరణ్ కి సరియైన పెళ్ళాం కాదంటూ ఆడిపోసుకున్నారు. ఇక్క పిల్లల విషయంలో ఐతే ఇంకా దారుణంగా ట్రోల్ చేసారు. ఐతే వాటిని ఆమె పట్టించుకోకుండా ధైర్యంతో ముందుకు సాగిపోయారు. సమాజం కోసం కాకుండా ఎట్టకేలకు వారికి నచ్చినప్పుడు ఆ దంపతులు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అవును, వీరికి బిడ్డ జన్మించిందని తెలియగానే పరిశ్రమనుండి అనేకమంది ప్రముఖులు అపోలో ఆసుపత్రికి పయనమయ్యారు. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి.

ఎందుకంటే మెగా కుటుంబానికి ఏం జరిగినా ఘట్టమనేని కుటుంబం అండగా ఉంటుంది. అదేవిధంగా ఘట్టమనేని కుటుంబానికి అవసరం వస్తే మెగా కుటుంబం వాలిపోతుంది. ఇక ఆ ఇరు కుటుంబాలకు వున్న అనుబంధం గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా చిరు – మహేష్ బంధం గురించి అందరికీ తెలిసినదే. మహేష్ సినిమా విడుదలైనప్పుడు మొట్టమొదటిసారిగా ఫోన్ చేసి విష్ చేసేది మన మెగాస్టార్ చిరుజీవినే. ఈ విషయం మహేష్ చాలా సందర్భాల్లో చెబుతూ ఉంటాడు. ఇక చాలా గ్యాప్ తరువాత రామ్ చరణ్ తండ్రి అయ్యాడనే విషయం తెలిసాక మహేష్ హుటాహుటిన అపోలోకి వెళ్లిన సంగతి అందరికీ తెలిసినదే. కాగా చరణ్ బిడ్డను చూసిన తరువాత మహేష్ చాలా తన్మయత్వానికి లోనయ్యాడని వినికిడి. తన సన్నిహితుల దగ్గర చరణ్ కూతురు అదిరిపోయిందంటూ చెప్పాడని గుసగుసలు వినబడుతున్నాయి.