టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాని రీసెంట్‌గా చూశాడు. ఆ తర్వాత సినిమాపై అలానే చిరంజీవి నటనపై పొగడ్తల వర్షం కురిపించాడు. సినిమాపై నెగటివ్ రివ్యూస్ వస్తున్న సమయంలో మహేష్ ఈ కామెంట్లు చేయడంతో వాటికి ప్రాధాన్యత సంతరించుకుంది. సినిమాని చూసిన తర్వాత మీడియా ముందుకు వచ్చిన మహేష్ బాబు ఈ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసినట్లుగా తెలుస్తోంది.
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం, మహేష్ బాబు మీడియా సమావేశానికి వచ్చి.. “భోళా శంకర్ సినిమా చాలా మంచి ఫిల్మ్. సినిమాలో చిరంజీవి నటన అద్భుతంగా ఉంది. ఇంతకుముందు చిరంజీవి గారు ఎలాంటి పర్ఫామెన్స్ అందించి టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్నారో మళ్ళీ ఇప్పుడు అలాంటి పర్ఫామెన్స్ కనబరిచి అతను స్క్రీన్ పై ఫైర్ వెలిగించారు. సినిమా టెక్నికల్ గా కూడా బాగుంది. మూవీ చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారని నేను చెప్పగలను. సినిమాని డైరెక్టర్ మెహర్ రమేష్ చాలా బాగా తెరకెక్కించాడు. సినిమాకి సంగీతం ఇచ్చిన మహతి స్వర సాగర్ కూడా అభినందనలు.” అని అన్నాడు.
భోళా శంకర్ సినిమా గురించి మహేష్ బాబు ఇలా పొగడ్తల వర్షం కురిపించడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా 2023, ఆగస్టు 11న విడుదలైంది. వేదాళం సినిమాకు అఫీషియల్ రీమేక్ గా వచ్చిన ఈ సినిమా విమర్శకులను మాత్రం పెద్దగా మెప్పించలేకపోయింది. భోళా శంకర్ కమర్షియల్ డిజాస్టర్‌గానూ నిలిచింది. ఔట్‌డేటెడ్ స్క్రీన్‌ప్లే, పేలవమైన రచన, చెడు దర్శకత్వం, ఊహించగల సీన్స్, రొటీన్ కామెడీ వల్ల విమర్శకులు ఈ సినిమా చూడకపోవడమే బెటర్ అని కామెంట్లు చేశారు. ఆడియన్స్ కూడా ఇవే సమస్యలను పేర్కొంటూ సినిమాను ఇష్టపడలేదు. ఫలితంగా ఈ సినిమా బాక్సాఫీస్ ఫ్లాప్‌గా మారుతోంది.