బ్రహ్మానందం చిన్న కొడుకు నిశ్చితార్ధ వేడుకలో సందడి చేసిన మహేష్ – నమ్రత!

టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం గురించి ప్రత్యేకించి పరిచయం అవసరంలేదు. ఆయనకి ఇద్దరు కొడుకులన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. మొదటి కొడుకు గౌతమ్ హీరోగా పరిచయం కావడంతో అందరికీ సుపరిచితుడు అయ్యాడు. కానీ ఆయనకు ఇంకో కొడుకు కూడా వున్నాడు. తాజాగా ఆయన చిన్న కొడుకు సిద్దార్థ్ నిశ్చితార్థం కన్నుల పండుగగా జరిగింది. మే 21 ఆదివారం డాక్టర్ పద్మజా వినయ్ కుమార్తె అయిన ఐశ్వర్యతో ఘనంగా ఈ వేడుక అతిరథమహారధుల మధ్యన జరిగింది.

పెళ్లి కూతురు ఐశ్వర్య కూడా డాక్టరే అవడం యాదృశ్చికం. ఇక ఈ వేడుకకు తెలుగు సినిమా పరిశ్రమనుండి అనేకమంది హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. ఈ క్రమంలో కమెడియన్ ఆలీ, రఘుబాబు, టి. సుబ్బిరామిరెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, నాగబాబు తదితరులు విచ్చేసి ఎంగేజ్ మెంట్ వేడుకను మరింత సందడిగా మార్చారు. మహేష్ అయితే సతీసమేతంగా విచ్చేసి కాబోయే కొత్త జంటతో ఫోటోలు దిగారు. కాగా ఈ వేడుకకు సంబందించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇక బ్రహ్మానందంకు ఇద్దరు కొడుకులు కాగా.. పెద్ద కొడుకు గౌతమ్ గురించి అందరికీ తెలుసు. గౌతమ్ ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తున్నాడు. అయితే చిన్న కొడుకు సిద్దార్థ్ గురించి మాత్రం ఎవరికీ తెలియదు. అయితే అతను విదేశాల్లో చదువుకొని అక్కడే ఉద్యోగం చేస్తున్నట్టు భోగట్టా. బ్రహ్మి కోడలు ఐశ్వర్య కూడా విదేశాల్లోనే డాక్టర్ గా పనిచేస్తుందని సమాచారం.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే, ఆమధ్యలో ఇలా తన కుటుంబంతో వివిధ ఫంక్షన్లకు హాజరవుతుండడం విశేషమే. అందుకే మహేష్ ని టాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అనేది. కాగా మహేష్ – త్రివిక్రమ్ కాంబో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాపైనే అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. మహేష్ గత సినిమాలు బాగానే ఆడినప్పటికీ బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే పడలేదు. అలాంటి రోజుకోసం జనాలు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.