Business Idea : ఈరోజుల్లో చాలామంది ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది. ఎందుకనగా సొంతంగా వ్యాపారం ప్రారంభించడానికి పెట్టుబడికి డబ్బు లేక వ్యాపారాలు చేయలేకపోతున్నారు. ఇలాంటి వారి కోసమే తక్కువ పెట్టుబడి తో అధిక లాభాలను పొందే ఒక వ్యాపారం ఉంది. అదే మసాలా దినుసులను తయారు చేయడం. ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఇంట్లోనే ఉండి చేసుకునే వ్యాపారం ఇది. అంతేకాక మసాలాలకు, మసాలా దినుసులకి మన భారతదేశంలో డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ మసాలా తయారీ వ్యాపారానికి తక్కువ పెట్టుబడి పెట్టి అధిక లాభాలను పొందవచ్చు.
ఎల్లప్పుడూ ఈ బిజినెస్ కు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తయారు చేయడం కూడా చాలా సులువు. మసాలాలు తయారు చేయడానికి ఒకసారి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రుచి, మసాలాలు ఉంటాయి. కేవలం వాళ్లు ఇష్టపడే రుచి గురించి మసాలాల గురించి తెలిస్తే చాలు. ఎవరైనా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. మన సొంత ఇంట్లోనే ఈ వ్యాపారాన్ని మొదలుపెడితే అధిక లాభాలను పొందవచ్చు. ఎందుకనగా ప్రాజెక్టు ఖర్చు మొత్తం తగ్గుతుంది కాబట్టి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు. వీటి ప్యాకింగ్ ఆకర్షణీయంగా ఉండాలి. ఇలా చేయడం వల్ల కస్టమర్లను ఆకట్టుకోవచ్చు.

మీరు ఈ వ్యాపారాన్ని పెంచుకోవడానికి మీరే సొంతంగా వెబ్ సైట్ క్రియేట్ చేయవచ్చు. వీటిని షాపులలో లోకల్ మార్కెట్లో ఆన్లైన్ లో కూడా వీటిని అమ్మవచ్చు. ఈ తయారీ యూనిట్ కి రూ.3.50 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.300 అడుగుల బిల్డింగ్ షెడ్డు కి రూ.60,000, పరికరాలకు 40,000 ఖర్చు అవుతుంది. ఇవే కాక మసాలాల తయారీకి రూ.2.50 లక్షలు ఖర్చు అవుతుంది. ఇంత డబ్బు మీ దగ్గర లేనట్లయితే బ్యాంకు నుండి రుణం పొందవచ్చు. ఈ వ్యాపారం చేయడానికి ఉపాధి పథకం కింద రుణం తీసుకోవచ్చును. ఏడాదికి 193 క్వింటాల మసాలా ఉత్పత్తిని చేయవచ్చు. క్వింటాల్ కి 5400 చెప్పున తీసుకుంటే ఏడాదికి రూ.10.42 లక్షలు విక్రయించవచ్చు. మిగతా ఖర్చులన్నీ పోగా రూ.2