Smart TV : బడ్జెట్ ధరలో స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నారా.. అయితే ఇదే బెస్ట్ ఆప్షన్..!

Smart TV : ఈమధ్య కాలంలో స్మార్ట్ టీవీ కొనాలనుకునే వారి సంఖ్య చాలా ఎక్కువ అవుతోంది. నిజానికి ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నట్టుగానే ప్రతి ఒక్కరి ఇంట్లో స్మార్ట్ టీవీ దర్శనమిస్తూ ఉంటుంది. మంచి వినోదాన్ని పొందడమే కాదు ఇంటికి మంచి ఆకర్షణ అందించడానికి కూడా ఈ స్మార్ట్ టీవీలు మరింత అద్భుతమైన ఆకృతులలో రావడం గమనార్హం. ఇకపోతే స్మార్ట్ టీవీ అనేది ఎప్పటికప్పుడు ప్రేక్షకుల కోసం అద్భుతమైన ఫీచర్లతో తక్కువ ధరలో అందుబాటులోకి వస్తూ ఉండడం గమనార్హం.

ఇక ఈ క్రమంలోనే బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ కొనాలని ఆలోచించే వారి కోసం ఒక అద్భుతమైన బడ్జెట్ ను మీకోసం తీసుకురావడం జరిగింది. మరి ఆ స్మార్ట్ టీవీకి సంబంధించిన అన్ని విషయాలను ఇప్పుడు క్లుప్తంగా చదివి తెలుసుకుందాం..Thomson 9A సిరీస్ 32 ఇంచెస్ హెచ్డి రెడీ ఎల్ఈడి స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ.. ఈ స్మార్ట్ టీవీ ని మార్కెట్లో ప్రవేశపెట్టినప్పుడు దీని ధర రూ.14,499.. కానీ ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ స్మార్ట్ టీవీ ని 17% డిస్కౌంట్ తో రూ.11,999 కే సొంతం చేసుకోవచ్చు. ఇక 32 అంగుళాలు కలిగిన ఈ స్మార్ట్ టీవీ ని మీరు ఫెడరల్ బ్యాంక్, ఐడిఎఫ్సి పోస్ట్ బ్యాంకు కార్డ్స్ ద్వారా రూ.1200 తగ్గింపుతో కేవలం రూ.10,799 కే కొనుగోలు చేయవచ్చు.

Looking for a smart TV at a budget price
Looking for a smart TV at a budget price

ఇక ఈ స్మార్ట్ టీవీ ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే.. 60 Hz రీఫ్రెష్ రేట్ తో..24 W సౌండ్ అవుట్ పుట్ ను అందిస్తుంది.. 1366 x 768 పిక్సెల్ రెజల్యూషన్ తో హెచ్డి రెడీ డిస్ప్లేను కలిగి ఉండే ఈ స్మార్ట్ టీవీలో గూగుల్ అసిస్టెంట్ తో పాటు క్రోమ్ కాస్ట్ కూడా వస్తాయి.ఇక సపోర్టెడ్ యాప్స్ విషయానికి వస్తే.. ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, ఎంఎక్స్ ప్లేయర్, Zee 5, సోనీ, యూట్యూబ్ వంటి పలు ఓటీటీ యాప్ లకు మద్దతు ఇస్తుంది. 3HDMI పోర్ట్ తో పాటూ 2USB పోర్ట్ , Wifi వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ తో ఈ స్మార్ట్ టీవీ లభిస్తుంది. 1 GB ర్యామ్ కెపాసిటీ తో 8GB స్టోరేజ్ మెమొరీ తో ఈ స్మార్ట్ టీవీ లభిస్తూ ఉండడం గమనార్హం.