5G Smart Phones : ఈమధ్య కాలంలో 5G నెట్వర్క్ గురించి ఎక్కడ చూసినా విస్తృతంగా వినిపిస్తోంది. ఇక 5G నెట్వర్క్ ను మనం యాక్సిస్ చేసుకోవాలి అంటే మన స్మార్ట్ మొబైల్ 5జి నెట్వర్క్ కు మద్దతు ఇవ్వాలి. ప్రస్తుతం ఉన్న స్మార్ట్ ఫోన్లు 5G నెట్వర్క్ ను సపోర్ట్ చేయవు. కాబట్టి మీరు కొత్తగా 5G నెట్వర్క్ సపోర్ట్ చేసే మొబైల్స్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మీలో ఎవరైనా 5G స్మార్ట్ ఫోన్ ను రూ.20 వేల లోపు కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే మీకోసం కొన్ని స్మార్ట్ ఫోన్స్ కింద లిస్టు చేయబడ్డాయి. వాటిని ఒకసారి చూసి మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
iQoo Z6 5G : రెండు బ్రాండ్లకు మాత్రమే ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. వినియోగదారులు ఇందులో బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ను ఆస్వాదించవచ్చు. మిగతా పనుల కోసం ఈ స్మార్ట్ ఫోన్ బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్ మీకు వన్ ప్లస్ నార్డ్ CE 2Lite 5G పనితీరును అందిస్తుంది. దీని ధర కేవలం రూ.16,999 మాత్రమే..
One Plus Nord CE 2 Lite 5G : AMOLED స్క్రీన్ కి బదులుగా ఎల్సిడి స్క్రీన్ లభిస్తుంది. డిస్ప్లే 120 Hz రీఫ్రెష్ రేట్ ను అందిస్తుంది. ఇక అలాగే కెమెరాల పనితీరు పగటిపూట చాలా బాగుంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో ఈ స్మార్ట్ ఫోన్ 30 నిమిషాలలోనే 50 శాతం వరకు చార్జ్ అవుతుంది. ముఖ్యంగా భారతదేశంలో ఎక్కువగా అమ్ముడుపోతున్న స్మార్ట్ ఫోన్ కూడా ఇదే కావడం గమనార్హం. ఇక ఈ స్మార్ట్ ఫోన్ రూ.19,999 కే లభిస్తోంది.
Realme 9 5G : ఈ స్మార్ట్ ఫోన్ 9 బ్యాండ్ లకు సపోర్ట్ చేస్తుంది. 90 HZ రిఫ్రెష్ రేట్ తో పనిచేయడం గమనార్హం. AMOLED డిస్ప్లేను అందించడంతోపాటు 18 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది ఇక ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.15,999 గా వుంది.
Redmi Note 11T 5G : ఈ స్మార్ట్ ఫోన్ మీకు 7 బ్యాండ్స్ కు సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా ఫోన్లను ఇష్టపడే వినియోగదారులకు ఈ స్మార్ట్ ఫోన్ బాగా నచ్చుతుంది అని చెప్పవచ్చు. ఇక ఇందులో బెస్ట్ కెమెరాను అందించడం జరుగుతుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.15,999 గా నిర్ణయించబడింది.