Hair Tips : వయసు పెరిగే కొద్దీ అందంగా ఉండాలి అనుకోవడం సహజమే.. అందుకే ప్రతి ఒక్కరూ రకరకాల ప్రయత్నాలు చేస్తూ అందాన్ని మరింత రెట్టింపు చేసుకుంటూ ఉంటారు. ఇకపోతే ఇందుకోసం మీరు వాడే ప్రొడక్ట్స్ లో కెమికల్స్ ప్రభావం ఏ రేంజ్ లో ఉందో ఒకసారి ఆలోచించాలి. జుట్టుకు ఉపయోగించే హెయిర్ ప్రొడక్ట్స్ లో కెమికల్స్ ప్రభావం ఎక్కువగా ఉంది అంటే వెంటనే డేంజర్ అని తెలిసిపోతుంది కాబట్టి మీరు ఎంచుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మీ జుట్టుకు సరిపడా హెయిర్ ప్రొడక్ట్స్ ను ఎంచుకుంటే మంచిది.ముఖ్యంగా జుట్టుకు వేసుకునే రంగులలో ఎక్కువ కెమికల్స్ ఉంటాయి. కాబట్టి ఇవి మీరు మీ జుట్టుకు వేసుకోవాలి అనుకున్నప్పుడు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.
వంటింట్లో దొరికే పదార్థాలతో మీరు పొడవైన, ఒత్తైన జుట్టు ను మీరు సొంతం చేసుకోవచ్చు. అదేమిటంటే ఉసిరి ,మందార పొడి, పెరుగును ఉపయోగించడం వల్ల జుట్టు ఒత్తుగా, స్ట్రైట్ గా చాలా చక్కగా పెరుగుతుంది. ఇకపోతే ఈ హెయిర్ మాస్క్ ను మీరు వాడడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం..ఇకపోతే ఈ హెయిర్ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలి అంటే ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా మందార పొడి, ఉసిరి పొడి ,పెరుగు వేసి మెత్తగా పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పొడులు తీసుకునేటప్పుడు మీ జుట్టు పొడవు బట్టి తీసుకోవాల్సి ఉంటుంది.

దీనిని పేస్ట్ చేసి మీ హెయిర్ కుదుళ్ళ నుంచి కొనల వరకు అప్లై చేయాలి. గంట పాటు అలాగే ఉంచేసి గాఢత తక్కువ కలిగిన షాంపుతో స్నానం చేయాలి.. ఈ మాస్క్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అంటే మందార పొడిలో అమైనో యాసిడ్స్ సమృద్ధిగా లభించటం వల్ల జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.ఉసిరి పొడి లో విటమిన్స్, మినరల్స్ ఉండడం వల్ల బ్లడ్ సర్కులేషన్ సహాయపడి జుట్టు రాలిపోవడాన్ని నివారిస్తుంది. ఇక పెరుగు వల్ల జుట్టు మెత్తగా స్ట్రైట్ గా తయారవుతుంది.