Loan Scheme : కేంద్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని.. ఏ ఒక్కరూ కూడా ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కోకూడదు అన్న ఆలోచనతోనే ఎన్నో రకాల పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ప్రతి నెల ఎలా డబ్బులు సంపాదించాలని అనే మార్గాన్ని ప్రజలకు చూపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలలో మనం బిజినెస్ ద్వారా కూడా నెలకు రూ. 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా సంపాదించవచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రుణ పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
2019 వ సంవత్సరంలో జరిగిన సర్వేలో, భారతదేశంలోని ఉత్తమ 100 కంపెనీల జాబితాలో మదర్ ఫ్రాంచైజీ కంపెనీ 39 వ స్థానంలో ఉంది. ఈ సంస్థ సుమారుగా 2500 రిటైల్ అవుట్‌లెట్లను కూడా కలిగి ఉంది.ఈ సంస్థ తమ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించాలని యోచిస్తోంది. ఇక అందులో భాగంగానే ప్రస్తుతం, బేకరీ విభాగంలోకి తొలిసారిగా ప్రవేశించాలని కంపెనీ ఆలోచిస్తోంది..ఇప్పటికే ఈ కంపెనీ మూడు రకాల ఫ్రాంచైజీ లను విడుదల చేసింది. మీరు కూడా తక్కువ పెట్టుబడితో అలాగే మంచి లాభాలతో ఫ్రాంచైజ్ వ్యాపారం చేయాలని అనుకుంటే .. మీరు కూడా మదర్ డెయిరీతో కలిసి ప్రయాణం చేయొచ్చు.
కేవలం రూ.5 నుండి రూ. 10 లక్షలు మాత్రమే పెట్టుబడి సరిపోతుంది.అయితే ఈ డబ్బు కూడా కేంద్ర ప్రభుత్వం మనకు బ్యాంక్ ల ద్వారా రుణం కింద అందిస్తుంది. చక్కగా ఈ ఫ్రాంచైజీలో చేరి నెలనెలా రూ.50 వేల నుంచి ఆదాయాన్ని పొందవచ్చు. అయితే మీరు మదర్ డైరీ తో కలసి ప్రయాణం చేయాలనుకుంటే మీకు కావలసిన ఐడి ప్రూఫ్ విషయానికి వస్తే.. ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటరు ఐడి కార్డు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. రేషన్ కార్డు, విద్యుత్ బిల్లు జిరాక్స్ కాపీ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే బ్యాంకు ఖాతా వివరాలతో పాటు ఫోటో, ఇమెయిల్ ఐడి, ఫోన్ నంబర్ కూడా అవసరం..