Liger Movie Review : లైగర్ మూవీ రివ్యూ హిట్టా.. ఫట్టా..!?

Liger Movie Review : రౌడీ హీరో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా గా తెరకెక్కిన చిత్రం లైగర్.. “సాలా క్రాస్ బీడ్” అనే ట్యాగ్ లైన్ తో డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరిగాయి.. లైగర్ సినిమా ప్రమోషన్స్ చూస్తుంటే సినిమా సూపర్ హిట్ ఖాయమని తెలుస్తోంది.. పూరి మార్క్ డైలాగ్స్, విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయని అంతా ఊహిస్తున్నారు.. అయితే ఈ సినిమా హిట్టా ఫట్టా అనేది చూద్దాం..!

కథ.. విజయ్ దేవరకొండ (లైగర్) తల్లి బాలమని (రమ్య కృష్ణ) తో కల్సి కరీంనగర్ నుంచి ముంబై వస్తారు.. విజయ్ లక్ష్యం ఏమిటంటే మిక్సిడ్ మార్షల్ ఆర్ట్స్ MMA లీగ్ లో గెలవాలని డిసైడ్ అయ్యి వస్తాడు.. సినిమాలో విజయ్ తండ్రి కూడా పెద్ద ఫైటర్.. ఇప్పుడు విజయ్ కూడా MMA లీగ్ లో ఛాంపియన్ అయ్యలని వస్తాడు.. తాన్య (అనన్య పాండే) అతన్ని తన ప్రేమలో పడేస్తుంది. ఆ ప్రేమ విజయ్ లక్ష్యాన్ని కాన్సన్ట్రేషన్ ను దెబ్బతీస్తుంది.. తాన్య ను పక్కకు పెట్టీ వరల్డ్ MMA లీగ్ లో ఛాంపియన్ షిప్ ఎలా వెళ్ళాడు మైక్ టైసన్ పాత్ర ఏంటి చివరికి విజయ్ తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా అనేది సినిమాలో చూడాల్సిన అంశాలు..

Liger Movie Review hit or flap 
Liger Movie Review hit or flap

విశ్లేషణ.. లైగర్ బాక్సింగ్ నేపథ్యంలో సాగే కథ.. ఈ కథను ఇంతకుముందు చాలామంది చాలా రకాలుగా చూపించడానికి ప్రయత్నించడు.. కానీ పూరి జగన్నాథ్ తనదైన స్టైల్ లో విజయ్ దేవరకొండ మార్క్ మేనరిజంను, మైక్ టైసన్ స్పెషల్ అట్రాక్షన్ తో లాగేయొచ్చు అని అనుకున్నాడు.. ఫస్ట్ ఆఫ్ ఓ మోస్తరుగా బాగుంటుంది.. మొదటి భాగం ముగిసేసరికి కథలో కాస్త స్పష్టత ఉండదు.. హీరోయిన్, విజయ్ ఫైట్స్ తో కాస్త గందరగోళంగా అనిపిస్తుంది.. ఇక సెకండాఫ్ సినిమాను నిలబడుతుంది అని వీక్షకులు అనుకున్నారు.. కానీ ఎక్కడికక్కడ కన్వీనియన్స్ గా సీన్స్ అల్లుకోవడం వాటికి తగ్గట్టు పాటలు మధ్యలో తీసుకువచ్చి అతికించినట్లుగా అనిపించాయి.. ఈ సినిమాలో పాటలు రిలీజ్ కి ముందు వచ్చిన రెస్పాన్స్ థియేటర్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి కేవలం అకిడిపకిడి సాంగ్ ఒక్కటే బాగుంది..

సీన్స్ సరిగ్గా సపోర్ట్ చేయలేదేమో అనిపిస్తుంది సినిమాలో చూశాక.. సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. సీన్స్ లో మేటర్ లేదనిపించినా కానీ కళ్ళు పక్కకు తిప్పుకొనివ్వకుండా ట్రై చేశారు ఆర్ట్ డైరెక్షన్ కూడా బాగుంది..గెటప్ శీను సినిమాలో కాసేపు నవ్వించగలిగాడు. ఆలీ క్యారెక్టర్జసం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. రమ్యకృష్ణ ఎప్పటిలాగానే తనదైన శైలిలో విజృంభించింది. కాకపోతే ఈసారి మాస్ క్యారెక్టరైజేషన్ తో ఊర మాస్ డైలాగులు చెప్పింది.. విజయ్ చెప్పే నత్తి డైలాగులు సినిమాను ఇంకాస్త బోర్ కొట్టించాయి మొత్తానికి ఈ సినిమా మొత్తం విజయ్ వన్ మాన్ షో లాగా నడిచింది సెకండ్ హాఫ్ ఏమాత్రం బాగోలేదు సెకండ్ హాఫ్ బాగుంది ఉంటుంటే సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉండేయి. పూరి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమానా ఇది అని అనిపిస్తుంది. బిజినెస్ మాన్, పోకిరి తీసిన డైరెక్టర్ అయిన ఈ సినిమా తీసింది అని అనిపించేలాగా ఉంది..

ప్లస్ పాయింట్స్..
విజయ్ స్క్రీన్ ప్రజెంట్
యాక్షన్ సీక్వెన్స్ లు
రమ్యకృష్ణ పర్ఫామెన్స్
బిజిఎం
అకిడిపకిడి సాంగ్.

మైనస్ పాయింట్స్..
రొటీన్ కథ
విజయ్ చెప్పే నత్తి డైలాగ్స్
స్క్రీన్ ప్లే

ఫైనల్ గా.. సినిమా కథలో కంటెంట్ లేకపోతే ఎంత పెద్ద హీరో సినిమా చేసేనా ఫలితం బూడిదలో పోసిన పన్నీరు లానే ఉంటుంది..

నటీనటులు: విజయ్ దేవరకొండ అనన్య పాండే రమ్యకృష్ణ రోనిత్రై విష్ణు రెడ్డి ఆలీ మకరంద దేశ్ పాండే గెటప్ శీను తదితరులు..
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : పూరి జగన్నాథ్
నిర్మాతలు : పూరి జగన్నాథ్, చార్మికోర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా
బ్యానర్స్ : పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్
రన్ టైం : రెండు గంటల 20 నిమిషాలు.
విడుదల తేదీ: ఆగస్టు 25 2022.