Lava Phones : లావా ఇయర్ ఫోన్స్..కేవలం రూ.11 కే .. ఎలా పొందాలంటే..?

Lava Phones : ఈ మధ్యకాలంలో ప్రతి వస్తువు కూడా ఖరీదు ఎక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే ఉపయోగించే వారి సంఖ్య ఎక్కువ.. తయారు చేసే వారి సంఖ్య తక్కువ అవడం, ట్రాన్స్ పోర్ట్ .. ఇలా వివిధ రకాల కారణాల వల్ల వస్తువుల ధరలు అధికమవుతున్నాయి . ఇకపోతే ఈ నేపథ్యంలోని మీరు కూడా ఇయర్ ఫోన్స్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ధరలు ఎక్కువగా ఉన్నాయని చాలామంది ఇష్టమైన వాటిని కొనుగోలు చేయలేకపోతున్నారు . ఇకపోతే మీరు కూడా అలా ఆలోచనలో ఉన్నట్లయితే మీకు శుభవార్త. ఎందుకంటే తక్కువ ధరకే ఇయర్ ఫోన్స్ కొనుగోలు చేసే అవకాశం అందుబాటులో ఉంటుంది.

ప్రముఖ లావా కంపెనీ తన కంపెనీ నుంచి ఇయర్ ఫోన్స్ ను అది తక్కువ ధరకే అందిస్తోంది అంటే కేవలం రూ.11 మాత్రమే.. అయితే మీరు ఎలా కొనుగోలు చేయాలి ? లావా కంపెనీ నుంచి ఏ మోడల్ విడుదలవుతోంది ? ఇలా అన్ని విషయాలను ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. లావా ప్రో బడ్స్ N11 పేరిట నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ ను మార్కెట్ లోకి ఆవిష్కరించింది.. ఇకపోతే వీటి అమ్మకాలు సెప్టెంబర్ 16 నుంచి మొదలుకానున్నాయి. ఇక ఈ ఇయర్ ఫోన్స్ ను కేవలం రూ.11 కే పొందే అవకాశం ఉంటుంది. ఇక ప్రముఖ ఈ కామర్ సంస్థ అమెజాన్ ప్రకారం లావా ప్రో బడ్స్ N11 ధర రూ.2,999. అయితే ఇవి ఇప్పుడు రూ.999 కే అందుబాటులో ఉండడం గమనార్హం . అంటే 67% డిస్కౌంట్ లభిస్తుంది.

Lava Ear Lava Phones only Rs.11k
Lava Ear Lava Phones only Rs.11k

ఇకపోతే రూ.11 కే ఎలా కొనుగోలు చేయాలి అనే విషయానికి వస్తే ఇంట్రడక్టరీ ఆఫర్ కింద మీరు ఈ రేటుకు ఈ ఇయర్ బర్డ్స్ కొనే అవకాశం ఉంటుంది . అయితే ఇది అందరికీ లభించకపోవచ్చు . కానీ ఈ ఆఫర్ ఉదయం 11 గంటలకు ఉంటుంది . స్టాక్ ఉన్నంతవరకే ఆఫర్ ఉంటుంది . కాబట్టి అదృష్టం ఉన్నవారికి రూ.999 విలువ గల ఈ ఇయర్ బడ్స్ కేవలం 11 రూపాయలకే లభిస్తుంది. ఇకపోతే ఆఫర్ సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 16 వరకు రూ.999 వద్ద లభిస్తుంది. ఇక ఆ తర్వాత మళ్లీ రూ.1499 వద్ద లభ్యమవుతుంది. ఇక మూడు రంగుల్లో లభించునుంది . గ్రీన్ , ఆరెంజ్, బ్లాక్ రంగులో లభిస్తుంది. 280 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా అమర్చబడి ఉంది.12mm డైనమిక్ డ్రైవర్స్ కూడా వున్నాయి. ఇక బ్లూటూత్ 5.2, ఐపీఎక్స్ 6 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ వంట ఫీచర్లు కూడా ఉన్నాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 24 వరకు చార్జింగ్ వస్తుంది.