Smart TV : 32 ఇంచుల స్మార్ట్ టీవీ కేవలం రూ.8 వేల లోపే.. హీట్ పుట్టిస్తున్న ఫీచర్స్..!!

Smart TV : ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నట్టుగానే ప్రతి ఒక్కరి ఇంట్లో స్మార్ట్ టీవీ అనేది ఒక తప్పనిసరి వస్తువుగా మారిపోయింది. ఇక వాటి సైజును బట్టి ధరలు కూడా మారుతూ ఉన్న నేపథ్యంలో చాలామంది పెద్ద టివి కొనాలని ఆశ ఉన్నా.. వారి బడ్జెట్ సరిపోక కేవలం చిన్న టీవీలకే సరిపెట్టుకుంటున్నారు. కానీ బడ్జెట్ ధరలో స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేసి అద్భుతమైన ఫీచర్లతో టీవీలో వచ్చే సినిమాల ను ఎంజాయ్ చేయాలని ఎదురుచూసేవారికి ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు. ఇక మీరు కోరుకున్న బడ్జెట్ ధరలోనే స్మార్ట్ టీవీ ని పొందడమే కాకుండా అద్భుతమైన ఫీచర్లతో ఈ స్మార్ట్ టీవీ కూడా లభిస్తుంది.

ఇక కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని ఇన్ఫినిక్స్ కంపెనీ సరికొత్త స్మార్త టీవీని మన ఇండియాలో లాంచ్ చేసింది. ఇక ఇన్ఫినిక్స్ Y1 స్మార్ట్ టీవీ పేరిట మార్కెట్లోకి విడుదల చేసి 32 అంగుళాల టీవీని తక్కువ ధరకే అనగా కేవలం రూ.8,999 కే అందించడానికి సిద్ధమయ్యింది. ఇక అంతేకాదు మిగతా టీవీలతో పోలిస్తే ఈ స్మార్ట్ టీవీలో అదిరిపోయే ఫీచర్లను కూడా అందివ్వడం గమనార్హం. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఓటిటి చానల్స్ అయినా డిస్నీ ప్లస్ హాట్ స్టార్, ప్రైమ్ వీడియో, సోనీ లివ్, యూట్యూబ్, జి ఫైవ్ అంటే తదితర యాప్లను ముందుగానే ఇందులో ఇన్స్టాల్ చేసి ఉంటాయని సంస్థ కూడా తెలిపింది..ఒకవేళ మీరు ఎస్బిఐ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 10% తగ్గింపు కూడా లభిస్తుంది.

Launched in the market as Infinix Y1 Smart TV
Launched in the market as Infinix Y1 Smart TV

అంటే రూ.900 తగ్గింపుతో కేవలం రూ.8,099 కే మీరు ఈ స్మార్ట్ టీవీ ని సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇక ఇందులో ఉన్న ఫీచర్స్ విషయానికి వస్తే డాల్బీ ఆడియో సౌండ్ సిస్టంతో 20 W ఔట్ పుట్ స్పీకర్లను కలిగి ఉంటుంది. 512 mb వాడుకోరు ప్రాసెసర్ తో 4 GB స్టోరేజ్, 3 HDMI, 2USB, 1ఆప్టికల్, 1 లాన్, 1మిరాకాస్ట్, క్రోమ్ కాస్ట్ తో పాటు వైఫై కూడా లభిస్తుందని ఇన్ఫినిక్స్ సంస్థ. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయినటువంటి ఫ్లిప్కార్ట్ లో ఇన్ఫినిక్స్ ఈ టీవీ లను అమ్మకానికి ఉంచింది. కాబట్టి మీరు కూడా మీరు కోరుకున్న బడ్జెట్ ధర లో అద్భుతమైన ఫీచర్లతో కూడిన ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేయవచ్చు.