Iphone : ఆపిల్ నుంచి ఏకంగా 2 ఐఫోన్లు లాంఛ్.. ఎప్పటినుంచంటే..?

Iphone : ఆపిల్ దిగ్గజం నుండి బ్రాండ్ ఐఫోన్ 14 సిరీస్ కోసం దేశవ్యాప్తంగా యువత ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.అంతే కాదు ఈ స్మార్ట్ ఫోన్ ఎలా ఉండబోతోంది.. ఇందులో ఫీచర్స్ , స్పెసిఫికేషన్స్ ఎలా ఉండబోతున్నాయి.. ఇక వీటి ధర ఏ రేంజ్ లో ఉంటుంది ఇలా అన్ని విషయాలు ఈ ఐఫోన్ గురించి తెలుసుకోవడానికి తెగ ఆత్రుత చూపిస్తున్నారు. మరి అతి త్వరలోనే విడుదల కాబోతున్న ఈ ఐఫోన్ 2 ఫోన్ ల గురించి లీకైన కొంత సమాచారం తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. మరి ఆ సమాచారం ఏమిటో ఇప్పుడు చదివి తెలుసుకుందాం.

సెప్టెంబర్ మొదటి వారంలో ఆపిల్ సంస్థ నుండి ఐఫోన్ 14 సిరీస్ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు ఇక ఈ క్రమంలోని ఐఫోన్ 12 , ఐ ఫోన్ 13 సీరీస్ లపై ధరలు కూడా తగ్గించనున్నట్లు వెల్లడించారు. అయితే కొంచెం డబ్బు ఎక్కువగా ఉండి ఐఫోన్ 14 కొనుగోలు చేయాలనుకునేవారు సెప్టెంబర్ వరకు ఎదురు చూడాల్సిందే అని ఆపిల్ సంస్థ కూడా వెల్లడించింది. ప్రస్తుతం ఈ క్రమంలోనే ఐఫోన్ 14 ప్రో సీరీస్ నుంచి కొన్ని ఫోటోలు, వీడియోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. ముందుగా 2022 ఏడాదిలో ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 మాక్స్ ఇలా రెండు మోడల్స్ గా రానున్నాయి. ఇక ఈ ప్రో మోడల్ కు సంబంధించి ఈవెంట్ ప్రతి ఏడాది మాదిరిగానే ఉంటుంది.

Launch of 2 iPhone s simultaneously from Apple.. Ever since..?
Launch of 2 iPhone s simultaneously from Apple.. Ever since..?

ప్రో , మాక్స్ ఎప్పటిలాగే పెద్ద స్క్రీన్ తో 6.7 అంగుళాల స్క్రీన్ తో రెండు ఐఫోన్లు కూడా రానున్నట్లు సమాచారం. ఆపిల్ లాంచ్ చేయనున్న 14 మోడల్స్ లో ఐఫోన్ 14 ప్రో.. ఐ ఫోన్ 14 మాక్స్ కూడా ఒకటి. ఇక ఈ మోడల్ అతి సరసమైన ధరకే అందుబాటులో ఉండనుంది. ఇకపోతే ఐఫోన్ ను ఎక్కువగా ఇష్టపడే యూజర్లను లక్ష్యంగా చేసుకొని ఆపిల్ ఈ ఐఫోన్ ను తీసుకొస్తోంది ఇకపోతే ఐఫోన్ SE సీరీస్ పెద్దగా సక్సెస్ కానందున ఈ మోడల్ ను నిలిపివేయాలని కూడా ఆపిల్ భావిస్తోంది. ఇక ఈ క్రమంలోనే ఐఫోన్ 14 ప్రో అతి త్వరలోనే గ్లోబల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇకపోతే ఐఫోన్ 14 ప్రో కన్నా ఐఫోన్ 13 ప్రో తో కొంచెం భిన్నమైన డిజైన్ కలిగి ఉండనుంది. ఐఫోన్ 14 ప్రో అద్భుతమైన డిజైన్ను కలిగి ఉంటుంది. 48 ప్రైమరీ కెమెరా కూడా అందించనున్నారు.