తారక్‌పై అనుచిత కామెంట్స్ చేసిన రోజాకి లక్ష్మీ ప్రణతి స్ట్రాంగ్ వార్నింగ్..

జూ.ఎన్టీఆర్‌పై ఏపీ మంత్రి ఆర్కే రోజా చేసిన కామెంట్లకు లక్ష్మీ ప్రణతి చాలా మనోవేదనకు గురయ్యారు. అనంతరం ఆమె దిమ్మతిరిగే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రీసెంట్‌గా రోజా తారక్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దాంతో లక్ష్మీ చాలా కోపానికి లోనై, తన భర్త ఒక గ్లోబల్ స్టార్ అని, అతన్ని పట్టుకొని అలా తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ఆమె అసహనం వ్యక్తం చేశారట. తన భర్త ఎవరిని ఏమీ అనలేదని, అతడిపై అన్యాయంగా నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకోనని లక్ష్మీ ప్రణతి సన్నిహితుల వద్ద అగ్గిమీద గుగ్గిలమయ్యారట. తారక్ సైలెంట్‌గా ఉంటున్నారని కదా అని, ప్రతి ఒక్కరూ అవమానించాలని చూస్తున్నట్లు ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారట.

ఇప్పటిదాకా భరించానని, ఇకపై పరువు నష్టందావా కేసు ఫైల్ చేయడానికి కూడా వెనకాడనని ఆమె అన్నారట. అవమానించిన ప్రతి ఒక్కరినీ నడి బజార్‌కి లాగుతానని ఆమె సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు టాక్. అయితే భర్త జోలికి వస్తే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోక తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన లక్ష్మీ ప్రణతిని అభిమానులు బాగా పొగుడుతున్నారు. సపోర్టివ్ వైఫ్ అని మరోసారి నిరూపించుకున్న వదిన అంటూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

ఇకపోతే లక్ష్మీ ప్రణతి లైమ్‌లైట్ నుంచి దూరంగా ఉండటానికి ఇష్టపడే ప్రైవేట్ వ్యక్తి. తన పిల్లలకు మంచి తల్లిగా, భర్తకు మంచి వైఫ్ గా ఉండడానికే ఆమె సమయం అంతా గడుపుతారు. ప్రణతి 1992, మార్చి 26న తెలంగాణలోని హైదరాబాద్‌లో జన్మించారు. ఆమె రియల్టర్, వ్యాపారవేత్త నార్నె శ్రీనివాసరావు కుమార్తె. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ చేసిన ప్రణతి జూనియర్ ఎన్టీఆర్‌ను 2009లో మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నారు. ఆపై ప్రేమించి, మే 5, 2011న హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు భార్గవ్ రామ్, అభయ్ రామ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

ప్రణతిది డౌన్ టు ఎర్త్ నేచర్. ప్రణతి తన భర్త కెరీర్‌కు బలమైన సపోర్ట్ సిస్టమ్. తెలుగు చిత్రసీమలో అత్యంత ప్రజాదరణ పొందిన జంటలలో ప్రణతి, జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఇక ప్రణతి ఎంతో మంది మహిళలకు రోల్ మోడల్. ఎక్స్‌పీరియన్స్డ్‌ భరతనాట్యం డాన్సర్.